8, ఆగస్టు 2024, గురువారం

కాకస్య దంతః

కాకస్య దంతః 

పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగుమీద ఇద్దరు పండితులు కూర్చొని ఒక విషయాన్ని గురినిచి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తర్కిస్తున్నారునారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుండి నడుచుకుంటూ  వెళుతున్నాడట. అది వారి కంట పడిందిఅప్పుడు పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కమును విని సమాధానం చెప్పమన్నారునారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యిందిఎందుకంటె గ్రామంలో  రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులని వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతిషాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలాఅతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది.. 

కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్లే తింటాయి కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు వుంది తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెపితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కే చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుండి ఇక దంతాలు పెట్టె అంట నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నదినిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్నతరువాట్ ఏమి మాట్లాడాలో   తెలియక తెల్లమొహం వేయవలసివచ్చింది నారాయణ  శర్మ. నిజానికి నారాయణ శర్మ వారిద్దరిలాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనయినా సాధించగల సాధకుడు. కొంచం ముందు బెరుకుగా ఉన్నకాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు

పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారో ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలను అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం  చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలిచిందనే చెప్పవచ్చుకొన్ని సందర్భాలలో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు పండితుల ఇద్దరి పరిస్థితి అట్లానే అయ్యింది. పేలబోయిన వారి ముఖములను కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను వత్తిడి చేశారు

నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలిఅందుకే నేను ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది..  మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివిలేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట

నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మలనుంచి తపిస్తూవుంటే ఈశ్వరుడు మనకు జన్మను  ప్రసాదించారు. ఏంటోజ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారుకాబట్టి కాలాన్ని వృధాచేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది

నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుస్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు

కాబట్టి భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా వున్నది క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేముతస్మాత్ జాగ్రత్త 

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 

కామెంట్‌లు లేవు: