:
ఇందిర రమణుడు తిరుమల
మందిర సుందర సురుచిర మందహసితుడా
నందమయుడువేంకటనా
థుందరిచేరితివిదేవదుందువుమెురయన్
:
సరిలేని నర్తకీమణి..సాటిలేని యామిని
సీ...
నిటలాక్షు వరముతో నటరాజపదయుగ్మ
కింకిణీరవళిగా క్షితిజనించి
యామినీపూర్ణరో.. యాంధ్రావనికిబిడ్డ
నృత్యగగనతార, నిరుపమాన.
యాబాల్యమదియేమొ!నందెవేసినచేయి
నృత్యాభినయముల,నిత్యజతుల
భామాకలాపాల భామగా సత్యయై
ఆంగికాహార్యాలనామనౌచు
క్షీరసాగరరూపకేందువదన మోహి
నీవేషధారిణీ ఠేవగనుచు
నిత్యదీక్షావిధి నేర్చెభంగిమలెల్ల
చేర్చెనీవిద్య సుశిష్యతతికి
తేగీ..
కూచిపూడి వేదాంతాన్వయాచిరయశు
లాగురువరేణ్యశుశ్రూషనాచమించి
నాట్యరీతుల ధృవతార నాగనిలిచి
పద్మసువిభూషితయగుచు పరవశించి
పరమశివుజేరె యామిని చిరమునుండ.
: ఉత్పలమాల:
+++++++++++
పద్ధతులన్నిమారినవి,పాఠముజెప్పెడు ధోరణంతయున్!
ఉద్ధతిగోరుచున్ గురువు,నుత్తమమై వెలిగించగోరుచున్!!
రుద్దగసాగెవారినిట,రూఢిగవారలునీరసించగా!
ముద్దుగసాగవేవియును,మూర్ఖపురీతులు వేంకటేశ్వరా!!
----
" శార్దూల..
--
శ్రీమన్మంగళదాతృదేవుశివునిన్ శ్రీధారిభస్మాంగునిన్
శ్రీమాతంగవరేష్టచర్మధరునిన్ క్షేమాది కైవల్యదున్
శ్రీమీనాక్షిపతిన్ త్రినేత్రుఁడగునా క్షీరోద్భవేంద్వంశకున్
శ్రీమన్నీలగళున్ విషాహిలసితున్ సేవింతు నిత్యమ్ముగా !!! "
----
:
బాహుబలి రూప!వాగీశ!ఫల్గుణ సఖ!
పతితపావన!లక్ష్మణ ప్రాణదాత!
రామకార్య ఫలీకృత!రాక్షసారి!
అతులితబలధామ!హనుమ!ఆంజనేయ!
రచన: శనగల చంద్రశేఖర్
: స్వామి హనుమ!నినుదలచువారికెపుడు
గలుగవు భయములు,తొలగుకష్టమంత
భక్తితోడపిలువనిన్ను పరవశించి
అభయహస్తమందించెదవాంజనేయ!
రచన:శనగల చంద్రశేఖర్
: యం ధర్మమాచరత్ స్వామీ
రామరూపేణ జీవనే!
కృష్ణరూపధరోవిష్ణు
రబోధయత్తమేవహి!!
ధర్మమేమి ధరను తానాచరించెను
రాముడగుచుసుగుణ ధాముడగుచు
తెలియజెప్పెనదియె తెల్లముగ ప్రజకు
కృష్ణరూపమంది విష్ణుమూర్తి
ఆ.
దన్ను లేక యున్న ధరను సమర్థుండు
తెన్ను దొరకకున్న దీక్షపరుడు
మిన్ను మీద పడిన మేటి లక్ష్య విభుండు
వెన్నుచూపరెపుడు చిన్న సూరి
: ||శ్రీమాత్రేనమః || దేవీదాస శర్మ
" అళి ఝoకారపు నూపురధ్వనులతో నందాల బాలేందు మం
జుల రేఖా విలసత్కిరీట రుచితో , శూలాది సంపత్తితో
జిలుగుంబచ్చల కంకణ క్వణలతో , చిర్నవ్వు ముత్యాలతో
వెలుగుల్విచ్చిన దివ్య దీధితులతో వేణూదిత శ్రీలతో !
----------
కరుణా కల్పిత మందహాసములతో కంపించు హారాళితో
స్ఫురదిందీవర లోచనచ్చవులతో , సొంపారు భృంగాల ముం
గురు లుయ్యాలల నూగు నీలిమలతో , గోమైన నెమ్మోముతో
శరదిందు ప్రతిమాన భావలహరీ సామ్రాజ్య భారమ్ముతో !
: *నేటిమంచిమాట* *చక్రవర్తి*
ఆవె.
పత్రికాధిపతులు పార్టీలలోఁజేర
ప్రోచికోలె ప్రగతి సూచియగును.
భాయి భాయి యయినఁ బత్రికల్ -పార్టీలు
గుండకమ్మె ప్రజల తిండియగును
శ్రీరామ స్తుతి🙏
సీ. నీలమేఘశ్యామ ! నినుగన మది నెంతు
కాన రావేమయ్య కామితార్థ !
సంస్తుతి కెక్కిన చక్కని నీ నామ
మనయమ్ము దలతును మనమునందు
మునులు నీనామమ్ము ముదముగ కీర్తించి
బడసిరి ముక్తిని పరమపురుష !
వలదు పరాకయ్య పరమాత్మ ! రఘురామ !
భక్తులన్ బ్రోవు మో భవ్యచరిత !
తే. పాపసంహార ! రఘువరా ! బవరవీర !
ధర్మమార్గాననడచిన ధన్యచరిత !
జానకిరమణ ! శ్రీరామ ! శరణు శరణు !
దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !
జయలక్ష్మి
:
*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!
17కం.
లీలలు చేసెడి భవుడా
శూలాయుధులైన రుద్ర శూరాళులతో!
ఏలా సైచుట వానిన్!
కాలుని నిజభటులవోలె కడతేర్చుడికన్!!
భావము:అనేకవింతలు చేసే పరమశివుడు శూలములు ధరించిన తన రుద్ర గణములతో వానియెడ నోర్పును వీడి యమకింకరులవలె వానిని చంపివేయుడు అని పలికెను.
[06/08, 6:59 am] +91 93475 37635: నిత్యపద్య నైవేద్యం-1571 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-206. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
జగ్రాహ్య సాధ్యం ఋగ్వేదాద్
సామజ్యో గీతమే వచ:l
యజుర్వేదాదభినయాన్
రసానే అధర్వణాపిll
తేటగీతి:
విశ్వసాహిత్య సుధను ఋగ్వేదమిచ్చు
విమల సంగీతమును సామవేదమిచ్చు
విపుల నటనను యజుర్వేదమిచ్చు
వివిధ రసము లధర్వణ వేదమిచ్చు.
భావం: ఋగ్వేదం నుండి సాహిత్యం అనగా మాటలు, పాటలు,పద్యాల లాంటివి, సామవేదం నుండి సంగీతం అనగా గానం, నేపథ్య సంగీతం లాంటివి, యజుర్వేదం నుండి చతుర్విధాభినయం అనగా ఆహార్యం, ఆంగికం, వాచికం, సాత్వికం లాంటివి, అధర్వణ వేదం నుండి శృంగార వీర రౌద్రాది నవరసాలు గ్రహించి విలసిల్లిందే నాటకం. కనుకనే నాటకం పంచమ వేదంగా పరిగణించబడుతోంది.
:
*వేణుగోపాల శతకం*
-గుడిసేవ విష్ణు ప్రసాద్.
9441149608.
12.
స్వప్నమందుననీవుకల్పనాస్వప్నమీవు
జాగరణమీవు జాగ్రత-జాగృతీవు
సుఖపునిద్రయునునీవు-సుషుప్తినీవుపతిత పావన!వేణుగోపాలదేవ!!
: *శ్రీకృష్ణ స్తుతి*
40)
వన్దేహ్యపారకరుణారసకృష్ణమూర్తిమ్।
వన్దే రమాధవ పరాత్పర రుక్మిణీశమ్।
వన్దే యశోగుణముఖాన్విత వీరబాలమ్।
వన్దే జగద్గురుపదాంచిత పాదపద్మమ్।
గురు చరణాంబుజా ధ్యాయీ
విజయ కుమార శర్మా
✍️విమల శ్రీ
:
మార్పుతో
పాహి మాం పరమేశ !
( పరమేశ వృత్తము - స న జ భ గ గా పదవ అక్షరము యతి.)
గిరిజాముఖకమలార్క ! ఖేచరపూజ్యా !
స్మరమర్దన శశిభూష ! సాంబ ! గిరీశా !
కరిచర్మధర ! కపర్ది ! కాలిమకంఠా !
సిరులిమ్ము పురనాశక ! శ్రీ పరమేశా !.. 1
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,
ధర్మపురి
శ్రిత భక్త క
:
దండక గర్భస్థ సీసము.
👇🏼
శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు నన్ను నీవు,
నీతోడు నాకున్న నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది నిశ్చయముగ,
శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ రచింతున్ కవిత్వంబు చిత్రగతిని,
శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ నేరంబులన్ జేయ నేరనేను,
తే.గీ. భక్తి యన్నను నీదయ్య భజన జరుగు
చోటులందుందువెప్పుడున్ జొక్కి యచట,
నీదు కృపఁ జూపి నాపైన నిర్మమగు
భక్తినే గొల్పు నాలోన, ముక్తినిడగ.
సీసమునందలి దండకము.
శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు, నీతోడు నాకున్న నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ రచింతున్ కవిత్వంబు, శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ నేరంబులన్ జేయ నేరనే.
🙏🏼
చింతా రామకృష్ణారావు.
!
----
" కం.
--
శ్రీమాతంగముఖానుజ
కౌమారీనాథపుత్ర కావుము మమ్మున్
మామకశరణమునీవే
సోమోపమముఖ సతతము 'సుబ్రహ్మణ్యా' !!! "
----
:
భగవంతుడు
-------------------
సీ||
జాబిల్లి విసిరిన జలతారు వెన్నెల
వన్నె తగ్గినదన్న చిన్నె
లేక;
కొమ్మలో కూసెడు కోయిలమ్మకు గొంతు
రాపిడి యనుమాట
చూపబోక;
కనుచూపు మేరగా కనిపించు గగనమ్ము
కొంచెమ్మునైన
కుంచించనీక;
కెరటాల యుద్ధృతి కెరలుచు నున్నట్టి
కడలి
గాంభీర్యమ్ము
సడలనీక;
తే.గీ||
వేయి విధముల విలసిల్లు విశ్వమంత
కుంటువడకుండ నడిపించు నొంటిగాడు!
క్షణము విశ్రాంతి నెఱుగని స్వామి యనుచు
చోద్యమును గాంచి మనసార జోతలిడుదు!
--------కోడూరి శేషఫణి శర్మ
:
*ఛేకానుప్రాస తో చంద్రలేఖా వృత్తము లో శ్రావణం లో లక్ష్మీ స్తుతి*
శ్రుత్వా శ్రుత్వా కథానాం లీలాగుణాన్ శ్రావణీ శ్రీః।
ధ్యాత్వా ధ్యాత్వా గుహాయాం హృత్పద్మ పీఠే తవాంఘ్రిమ్।
మత్వా మత్వా కవిత్వం సంస్తుత్యగీతమ్ కృతోస్మి।
హృత్వా హృత్వా మదీయ క్లేశాన్ చ నిష్ఠాం తనోతు ।
గురు చరణాంబుజా ధ్యాయీ
విజయ కుమార శర్మా
✍️ విమల శ్రీ
:
కిశోర వాణి
-----------
ఉన్న దానితోడఁనూరకుండుట లెస్స
యాసపడిన కుక్క మోసపోయె;
నీటి నీడఁగాంచి నోటి మాంసపు ముక్క
కుడువలేక తుదకు కోలుపోయె......
: మహిళలు... మంగళగౌరులు
సీ..
భరతావనికె చెల్లు పరమపావన దృక్ప
థ సుపర్వ రీతులున్ ధార్మికములు తిథివారనక్షత్ర దినములామాసముల్
దివ్యములున్ మరి భవ్యదములు
మానవజన్మను నానాల్గు పురుషార్ధ
ములె సార్ధకపరుప ముఖ్యమెంచ
మహిళామణులునెల్ల మంగళ గౌరులై
తాదాత్మ్యభావనన్ తపమదెంచి
తేగీ...
కూడి నోములు నోచునో కొదువలేక
సకలసౌభాగ్యములునంద జరుపుచుండు
పసిడి కాంతులు భద్రముల్ పరగనింట
లక్ష్మి బిల్చుచు గొల్తురు లలనలెల్ల...
తొలి శ్రావణ మంగళవారం....శుభవేళ..
రాయప్రోలు జగదీశచంద్రశర్మ. తెనాలి
విశ్వామిత్ర మహర్షి రాముని తన వెంట పంపమనగా దశరథుడు మాట్లాడిన సందర్భం
తేటగీతి మాలిక
దశరథుడుపల్కె మునితోడ ధైన్యముగను
పాలుగారు మోమున పసిబాలు డితడు
అడవిపాలును చేయంగ తడుము చుంటి
నాదు లోపాలు మన్నించి నమ్ము దేవ !
నాకు కన్నుల దీపాలు నాదుసుతులు
జయలక్ష్మి పిరాట్ల
,
:
||గతకాల స్మరణ ||. దేవీదాస శర్మ
స్వస్త్యస్తు విశ్వవిశ్వంభరా ధారణో
ద్దామ దక్షిణభుజా స్తంభ నీకు
విజయోస్తుసకలపృద్వీపాల మస్తక
న్యస్త ప్రశస్త పాదాబ్జనీకు
శ్రీరస్తుప్రాక్ప్రతీచీసముద్రాంతస్థ
నాయకార్పిత భాగధేయ నీకు
నిర్విఘ్నమస్తువాణీప్రసాదాపూర్వ
కవితామహా చమత్కారి నీకు
నిత్యకళ్యాణమస్తు మానిత బుధాగ్ర
హారసంతతనహనశోభాఢ్యకంధ
రా వినమ్ర కర్ణాటక సామ్రాజ్య పద్మి
నీ వికస్వర హృదయాది నేత నీకు:
మ॥
గతకాలమ్మది జ్ఞప్తిఁ బొంద నుపయోగమ్మేది యిక్కాలమున్
స్తుతనీయమ్ముగుఁ గొన్ని సార్లు మరి యస్తోకానందమై నిల్చెడిన్
గతముందల్వఁ భీతిగొల్పు నొకచో కాఠిన్యదుఃఖావళిన్
ధృతితో నెగ్గగఁ జింతఁ జేయవలెఁ బ్రీతిం బొంద రాగాలమున్
*~శ్రీశర్మద*
: ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్లో. హరణం చ పరస్వానాం - పరదారాభిమర్శనమ్ |
సుహృదశ్చ పరిత్యాగః - త్రయో దోషాః క్షయావహాః ||
(మహాభారతం)
కం. ఇతరులసొమ్మును దోచుట,
యితరుల స్త్రీలను చెరచుట,
నుతుఁడగు మిత్రుని విడుచుట,
క్షితిపైన వినాశ మొసగు, కీడును గొలుపున్.
భావము. ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను రెచ్చగొట్టడం, స్నేహితులను విడిచిపెట్టడం - ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.
అమ్మదయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి