4, జులై 2020, శనివారం

వేదాలు , శ్లోకాలు‌, మంత్రాలు ,



వేదాలు , శ్లోకాలు‌, మంత్రాలు , ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ మహాభారతాలు  అన్నియు ప్రప్రథమంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డవి.  సంస్కృతం రానివాళ్ళకు ఒక్క ముక్క కూడా అర్థం కాని పరిస్థితి. 

వీటి కారణంగా పెక్కుమంది వీటిని చదవటానికి వెనుకంజ వేయవచ్చు. 

యిప్పటి చదువులన్నీ పైపై చదువులే. భాషపై పట్టు తక్కువ. పై విషయాలన్నీ చదవాలంటే నోరు తిరగదు, తిరిగినా అర్థం కాదు. అందువల్ల వాటిని చదవటానికి ఒక విముఖత తయారుకాగలదు. 

కాని యెటువంటి యిబ్బందులున్నా వీటిని రోజుకు ఒక్క శ్లోకమైనా ఒక్క పేజీ అయినా చదవాల్సిందే. 

అర్థం కానక్కర్లేదు, నోరుగూడా సరిగ్గా తిరగనక్కర్లేదు. రోజూ చదువుతుంటే నోరు తనంతట తాను యెటువంటి కృషి లేకుండా తిరగగలదు. 

యిక అర్థానికి వస్తే మీకు ఒక చిన్న వివరణ యివ్వాలి. 

బ్రాహ్మణ వంశ చిన్న బాలురకు తొమ్మిది వయసులో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపనయనం చేయడం పరిపాటి. ఈ ఉపనయన కార్యక్రమంలో ఒక్క తతంగం గురించి మాట్లాడదలిచాను. 

అది యేంటంటే భిక్షాటన. యిది ఒక తంతు మాత్రమే.ఆ బాలుడు ప్రతి మహిళ దగ్గరకెళ్ళి భవతీ భిక్షాంధేహి అని అనాలి. సిద్దాంతి వటువును ప్రతి మహిళ దగ్గరకు  తీసుకెళ్ళి ఈ తతంగం కొనసాగిస్తారు. 

ఆ మహిళలు కూడా ఆ వటువుకు భిక్ష వేస్తారు. ఒక పది మంది దగ్గర యిలా అడుగుతూ భిక్ష పుచ్చుకంటే ఆ  వటువు దగ్గర వున్న భిక్ష పాత్ర నిండి పోగలదు. 

కాని ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా చెప్పొచ్చు. పాపం ఆ బాబు యేమి తెలియని పసివాడు. పెద్ద వాళ్ళు సిద్దాంతి యె‌లా చెప్తే అలా చేయాలని అతనికి ముందే సూచించారు.ఆ ప్రకారమే ఆ అబ్బాయి కార్యక్రమాలు సాగిస్తున్నాడు. 

భిక్షాటన అంటే అతనికి యేమీ తెలియదు. భవతీ భిక్షాంధేహి అంటే అర్థం తెలియదు. పెద్దలు అలా చేయమన్నారు కాబట్టి చేసాడు. భిక్ష పాత్ర నిండి పోయింది. 

కాని ఆ ముత్తయిదువులకు తెలుసు. అలాంటి భిక్ష సమయంలో భిక్ష పాత్రలో భిక్ష యివ్వాలని. అందువల్లనే వాళ్ళు యివ్వగలిగారు. 

అంటే యిక్కడ గూడార్థం యేంటంటే తను అడిగిన దానికి అర్థం అడిగేవాడికన్నా యిచ్చేవాడికి అర్థమయితే చాలన్నట్టు. 

యిప్పుడు మనం ఈ వృత్తాంతాన్ని మన అర్థంకాని సంస్కృత భాషా శ్లోకాలకు మంత్రాలకు అన్వయిద్దాం. 

ఈ శ్లోకాల అర్థాలు మనకు తెలియనక్కర్లేదు. ఈ శ్లోకాలు యెవరిని ఉద్దేశించే చెప్పబడ్డది, వారు లలితాంబిక కావొచ్చు, హనుమంతుడు కావొచ్చు, శ్రీరాముడు కావొచ్చు లేదా శ్రీ కృష్ణుడు కావొచ్చు. 

ఆ దేవుళ్ళందరు వీటి అర్థాలు తెలిసినవాళ్ళే. ఈ శ్లోకాలు పఠించేవారిని ఆ దేవతలు నిరుపమానంగా సహాయపడగలరు. వారి సంకటాన్ని హరించి సదా శ్రేయస్సు సమకూర్చగలరు. 

అందువల్ల యెటువంటి మంత్రాలకు శ్లోకాలకు అర్థం తెలియటంలేదని యెవ్వరు భాధ పడనక్కరలేదు.

వాటిపై పట్టు ప్రయత్నం చేసిన కొద్దీ సమకూరగలదు. ఆ పట్టు ఒక్కటే కాదు. వాటివల్ల సత్పలితాలు పొందగలరు. 

అందువల్ల ప్రతియొక్కరు వారికి యిష్టమైన దైవాన్ని స్తుతించడం వెంటనే ప్రారంభించండి. విజయం సాధించండి.

కామెంట్‌లు లేవు: