జీవితంలో ఎప్పుడూ అనుకోని *సమస్యలే* ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా *ఎదుర్కోవాలో* తెలుసుకోవడమే *జీవితం* దీనిలో *గెలువడాలు ఓడిపోవడాలు* ఉండవు *పాఠాలు* అనుభవాలు మాత్రమే ఉంటాయి , మనం *అవసరం* లేని వారి గురించి ఆలోచించి *ప్రయోజనం* లేదు వాళ్ళు *బంధువులైనా* సరే మన *విలువ* తెలియని వాళ్ళతో ఏం *మాట్లాడినా* వాళ్ళకు ఏం చేసినా మన *విలువ* తెలియదు .
ముఖం పై *చేదుగా* మాట్లాడే వారు ఎప్పుడు *మోసం* చేయరు భయపడవలసింది *తియ్యగా* మాట్లాడే వారితోనే *మనసులౌ అసూయ* పెంచుకుంటారు *సమయం* వచ్చినప్పుడు మారిపోతారు *అద్దం* బలహీన మైనదే కానీ *నిజాన్ని* చూపడంలో ఎప్పుడూ *భయపడదు* విజయానికి కొన్ని సార్లు *శక్తి* కావాలి మరికొన్ని సార్లు *యుక్తి* ఉండాలి ఇంకొన్ని సార్లు *రెండు* వాడాలి *కానీ* చాలా సార్లు ఈ రెండిటికీ *అదృష్టం* తోడు కావాలి .
జీవితంలో ఎదురు *దెబ్బలు* తగలడం మంచిదేనేమో *కాలికి* దెబ్బ తగిలితే *వెళ్లేదారిలో* ఎలా *నడవాలో* తెలుస్తుంది అదే *మనసుకు* తగలితే ఎటువంటి వారితో *ఎలా* ఉండాలో నేర్పిస్తుంది . జీవితంలో *డబ్బు* ఉంటేనే *బంధువులు ప్రేమ నమ్మకం* వస్తాయి డబ్బు లేకుంటే మన *సొంత* వారు కూడా *పరాయి* వారు అవుతారు *డబ్బుంటేనే* పరాయి వారు కూడా మన వారు అవుతారు *ఇది పచ్చి నిజం !*.
*మీ ... ప్రొద్దుటూరి. రవిందర్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి