తెప్పోత్సవము (వ్యాకరణవిరోధమై,మాప్రాంత జన వ్యవహారంలోఉన్న పదం)
-------------------- ------------------------
చల్లనినీళ్ళును సౌఖ్యపు గాలులు
లాహిరి లాహిరి లాలసనిడ ,
మంచిసుగంధపు మల్లెలమాలలు
మారుని సేవల మనసునిడ,
తాపముపెంచెడు దీపపు కోటులు
విడివడిమసలని ప్రేమమునిడ ,
పారవశ్యముగొల్పుబాణసంచాకాల్పు
సోత్సహచైతన్య శోభలనిడ,
పార్వతీ పరమేశ్వరుల్ పర్వమమర
తెప్పలను నుత్సవంబుగ తిరుగబూన
త్రిదినముమహోత్సవమ్మది త్రిదివమట్లు
జరిగె శివరాత్రి మూన్నాళ్ళుశివముగాగ.
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి