సకల జీవుల నిత్య సత్య చైతన్య స్ఫూర్తిగా విరాజిల్లే ప్రకృతి మహోన్నతం ! ప్రాతఃకాల కుక్కుట నాద స్వరంలో చరాచర జీవజగతికి సన్మత్రీ మేల్కొల్పు ! సువిశాల విశ్వ నిత్య జీవన గమనంలో నిరంతర తోడ్పాటు ! చక్కని రమణీయ, కమనీయ ఆలంబనతో తరతరాల సుహృద్భావ దృక్పథ దార్శనికత ! విశ్వ మానవాళికి మనోంతరంగ పరిశుద్ధికై అనునిత్యం, ప్రకృతి చేసెడి హెచ్చరిక వర్ణనాతీతం ! విశ్వ జగతి సుసంక్షేమమే మహత్తర ఆలంబనగా మున్ముందుకు సాగే సమైక్య దృక్పథ నేపథ్యం ! చక్కని జీవకారుణ్య ప్రేరణాత్మక భావుకత ఉట్టిపడే చరాచర జీవజగతికి సమున్నత వేదిక ! ప్రకృతి పరిరక్షణకై విశ్వ మానవాళి నిత్య నడవడికలో సుహృద్భావ జీవన దివ్య పథ నిర్దేశన స్ఫూర్తి ! పరిసరాల పరిశుభ్రతే అత్యంత ప్రధానాంశంగా, యావత్ విశ్వ సువికాస సంక్షేమ జీవన గమన చైతన్య దార్శనికత ! ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి