సర్పములు వాటిలోని రకాలు -
సర్ప జాతులు 2 రకాలుగా ఉండును.
1 - దేవతా సర్పాలు .
2 - భూమి మీద ఉండు సర్పాలు .
దేవతా సర్పముల రకాలు -
అనంతుడు, వాసుకి , తక్షకుడు, కర్కోటకుడు , పద్ముడు, మహా పద్ముడు , శంఖపాలుడు, కులికుండు అని 8 రకాల దేవతా సర్పాలు కలవు.
దేవతా సర్పముల గుర్తులు -
అనంతుని కి ఫనాగ్రము నందు శ్వేత పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నం ఉండును. వాసుకికి వీపు మీద నల్ల కలువ పువ్వు వంటి గుర్తు ఉండును. కర్కోటకుడికి మూడు నేత్రములు బోలిన
చిహ్నం ఉండును. తక్షకునికి పడగ యందు స్వస్తికము వంటి గుర్తు ఉండును. శంఖు పాలుని కి వీపు నందు అర్ద చంద్ర త్రిశులాకారం గల గుర్తు ఉండును. మాహా పద్మునికి వీపు నందు రాజవర్త మణి తుల్యమగు చుక్కలు ఉండును. పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. ఈ గుర్తులు బట్టి దేవ నాగులు అని తెలుసుకొనవలెను.
దేవ నాగులకు వారములు -
ఆది, సొమ, మంగళ , బుద, గురు, శుక్ర , శని వారము పగలు, శనివారము రాత్రి అను వారముల
యందు మాత్రమే క్రమముగా అనంతుడు మొదలగు దేవతా సర్పములు కరుచును. అప్పుడే వానికి విషం అధికముగా ఉండును.
దేవతా సర్పముల మహిమ -
ఈ దేవతా సర్పములు 8 రకాలుకి జరా మరణాలు లేవు . వీటి విషానికి చికిత్స నే లేదు .
భూమి మీద ఉండు సర్పాలు -
ఇవి 4 రకాలుగా ఉండి భూమి పై ఎల్లవేళల సంచరించును.
ధర్వీకములు , మండలీ సర్పములు , రాజి మంతములు , ఉపజాతి సర్పములు .
వీటి లక్షణములు -
పడగలు కలిగి గరిట వలే ఉండునవి ధర్వీకములు అనియు, శరీరం అంతయు రత్న కంబళి వలే గాని చాందిని వలే గాని చిత్ర విచిత్రమైన పొడలు గలిగి యుండునవి మండలీ సర్పములు అనియు, శరీరం నందు సన్న చుక్కలు , ఉర్ధ్వ రేఖలు , తిర్యక్ రేఖలు కలిగి చిత్రాకారం గా ఉండునవి రాజిమంతనములు అని చెప్పబడును.
వీటి విష లక్షణాలు -
ధర్వీకరముల విష లక్షణము ఉష్ణము తో చేరిన కారముగాను, మండలీ విషము ఉష్ణము తో చేరిన పులుసు గాను , రాజిమంత విషము చలువ తో చేరిన మధురం గాను ఉండును. ఈ రుచులను బట్టియే వాతాది దోషములు ప్రకోపించును.
భూమి మీద ఉండు సర్పముల సంఖ్య -
ధర్వీకములు ( త్రాచు పాములు ) పదునాలుగు విధములుగాను , మండలీ సర్పములు ( పెంజర ) ఇరువది యెక్క బేదములు గలవి గాను రాజమంత సర్పములు ( క్షుద్ర జాతి సర్పములు ) ముప్పది ఆరు విధములుగా యున్నవని తెలియును .
త్రాచు పాములలొ రకాలు -
చింతపువ్వు వన్నె త్రాచు , నాగజేర్రి, రేల త్రాచు , సెనగ పువ్వు త్రాచు , నల్ల త్రాచు , అరికె వన్నె త్రాచు కంది పొడల త్రాచు , మొగలిపువ్వు త్రాచు , తెల్ల త్రాచు , కోడె త్రాచు , గిరి నాగు , నీరు త్రాచు , గొధుమ త్రాచు , రాచ నాగు అని పదనాలుగు రకాలు .
త్రాచు పాము లక్షణములు -
చింతపువ్వు వన్నె త్రాచు లక్షణము -
చింతపువ్వు వన్నె శరీర ఛాయ, సాధారణం అగు క్రోధమును , ఆదివారం నందు విషం అధికం కలిగి యుండునది చింతపువ్వు వన్నె త్రాచు అని చెప్పబడును.
నాగజెర్రి లక్షణము -
సగం త్రాచు పాము వలెను, సగం జెర్రిపోతు వలెను ఉండి చెట్ల తోర్రల యందు , చెట్ల యందును నివసిస్తూ గోదుమవన్నే తెలుపు రంగు కలిగి అత్యంత కోపమును కలిగి సొమవారం నందు విషం అదికంగా కలిగి యుండెడిది నాగజెర్రి అను త్రాచుపాము .
రేల త్రాచు లక్షణము -
అడువుల యందు నివసించుట, సన్నని పొడవు గల శరీరం కలిగియుండుట, సొమవారం నందు విషం అధికంగా కలిగియుండి , సామాన్య కోపముని కలిగి యుండేది రేల త్రాచు అని చెప్పవచ్చు.
నల్ల త్రాచు -
నేరేడు పండు వర్ణమును , మితమైన పొడవుని , ప్రచండమైన కొపమును, స్వచ్చమైన విషమును , పర్వతముల యందు నివాసమును, మంగళవారం నందు విషం అధికముగా కలిగియున్డునది నల్లత్రాచు అని చెప్పబడును.
అరికవన్నే త్రాచు -
మల విసర్జన స్థలముల యందు సంచారము , మల భక్షణము , అత్యదిక కొపము, స్వచ్చమైన గరళము, బుదవారం నాడు విషం అధికంగా కలది. ఆరిక ధాన్యం వంటి రంగును కలిగి యుండును.
కంది పొడల త్రాచు -
కంది బెడల వంటి పొడలు కలిగిన శరీరం తో , సామాన్యమగు కొపము, బుదవారం విషం అధికంగా కలిగి ఉండును.
మొగలిపూవు త్రాచు -
గేదంగి రేకు సమానమైన ఆక్రుతియు, వెండితో తుల్యమైన శరీరచాయని పరిమళించు కుసుమములు గల ప్రదేశములు , మొగలి పొదలు పరిమళ ఔషధాలు కలుగు అరణ్యముల నందు సంచారంను, కొపము లేమియు, అతి శాంతమును,
సుక్షమమైన మొగలిరేకు ప్రమాణం శరీరంను, గురువారం నందు విషమును అధికంగా కలిగి యుంటుంది.
తెల్లత్రాచు -
కొపంలేమియు , సాత్విక గుణమును, శాంత స్వభావమును, వెన్నెల వంటి శరీర ధావల్యమును,
గురువారం నందు విషము అధికము గా కలిగి యుండునని తెల్లత్రాచు అని చెప్పబడును.
కోడె త్రాచు -
18 అంగుళాల నిడుపును , కోళ్ళని భ్రమ చెందించుటకై కోళ్ల వలే అరుచును. ఇండ్లయందును, కోళ్ల గుళ్ళ యందు నివాసమును , అధిక కోపమును, రాత్రుల యందు కోళ్ళని భక్షించుట , రూపం నందు భయంకరత్వం , చురుకుదనం , శుక్రవారం విషం అధికం కలిగియున్డునది కోడెత్రాచు
గిరినాగు -
చంద్రబింబం వంటి వట్రువ, ధావళ్యం కలిగిన పడగ, పర్వతముల యందు సంచారం, చెట్లకొమ్మల మీద నివాసం, నిరంతరం పక్షులను భక్షించుట, పడగ యందు కృష్ణ పాదములు , శుక్రవారం విషమును అధికముగా కలిగి యుండును.
నీరు త్రాచు -
అధికమగు విషమును , అతి కొపమును, జలము నందు సంచారమును, జలజంతు భక్షణ, శుక్రవారం నందు విషం అధికముగా కలిగి యుండునని చెప్పబడును.
గొధుమ త్రాచు -
సాత్విక స్వభావం , గజము పొడవును, శనివారం నందు విషం కలిగి యుండునది గోదుమత్రాచు .
రాచ త్రాచు -
గుండ్రమై కృష్ణ పాదములు లేని పడగ యు , మూడడుగుల పొడవు, అధిక కొపము, భయంకర స్వభావము, పగతీర్చుకొను నట్లు పట్టుదలయు, పర్వతారన్యముల నందు నివాసము, పసుపుపచ్చని కాంతియు, బుదవారం నందు అధిక ప్రభావంతమైన విషాన్ని కలిగియుండును. ఇది విశాఖపట్నం మండలం నందు మాత్రమే కనిపించును. మరిఎక్కడా కనిపించదు.
మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి