12, ఏప్రిల్ 2023, బుధవారం

భగవన్నామ స్మరణ

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴 సంసార సాగరంలో మునిగిపోతూ మనశ్శాంతి లేకుండా నిత్యమూ ఏదో ఒక చింతతో సతమతమవుతూ  ' మా పరిస్థితి ఇంతేనా! మేము ఇలా ఉండిపోవల్సిందేనా!! మాకు ఉద్దరింపబడే మార్గం లేదా!!? ' అని చింతించేవారు ఒకసారి తెలుసుకోండి. పుష్కరాలు సమయంలో నదిలో స్నానం చేసినపుడు నది ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడానికి నదిలో ఇనుప గొలుసులుతో పొడవాటి త్రాడువంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు. స్నానం చేసేవారు ఆ గొలుసులు పట్టుకుని స్నానం చేస్తారు.  అలాగే సంసారము అనెడి నదిలో ఉండి కూడా వాటి బంధాలనే ప్రవాహానికి కొట్టుకుపోకుండా  ఉండడానికి భగవంతుడు భగవన్నామ స్మరణ అనే గొలుసు ఏర్పాటు చేశాడు.  ఈ గొలుసు గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకూ ఈ సంసారపు చింతల ప్రవాహం  మనల్ని ఏమీ చేయలేదు. ప్రవాహం వేగముగా ఉన్నపుడు గొలుసును మరింత దృఢముగా పట్టుకోవాలి తప్ప వదిలేయకూడదు. ఎంత దృఢముగా పట్టుకుంటే అంత రక్షణ. కనుక అనవసర చింతలు మానివేసి భగవంతున్ని స్మరిస్తుండండి. సకల చింతలు రూపుమాపేది ఒక్క సర్వేశ్వర చింతనే అన్న సత్యమును మరువకండి.🌴

కామెంట్‌లు లేవు: