కొడవలి చేతబట్టుకొని గొంతుక కూర్చుని , పల్లి చేలలో
కొడుముల నీరుజల్లుచును గొప్పులు త్రవ్వి దినాంతమందు , పూల్
ముడచిన కొప్పుపై కడవ పొందుగ నిల్పి , శ్రమం బెఱుంగకే
వడివడి పోవు చానల విభావము చూడగ మోదమయ్యెడున్.
చేతను పాల చిక్కము , సుచేలక మొక్కటి మూపుపైన , డా
చేతను దుడ్డుకఱ్ఱ , చిఱు చెమ్మట మోమున కిర్రు చెప్పులున్ ,
ప్రీతిని గొఱ్ఱె పోతు తన వెంట చనంగను , దుక్కి టెద్దులన్
హూతి నదల్చుచున్ వెడల చుండెను రైతు కనoబడున్ మదిన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి