29, మార్చి 2025, శనివారం

ఆశయం

 ఆశయం 


జననమరణ చక్రంలో 

జనియించే పట్టుదల

మనిషి మనసులో రగిలే 

సాధించాలనే ఆశయం!


నిదుర వదిలి నిట్టూర్చి

అనుకున్నది సాధిస్తే

అమరసిద్ధి కలుగును

ఆశయ సాధన జరుగును!


చేసుకున్న కర్మలని చేధించి

మంచిఆశయం మొలకెత్తించి

పట్టుదలనే పణంగాపెట్టి

పరిశ్రమిస్తే కలుగు విజయం!


పదిమందికి పాటుపడుతు

ప్రగతివైపు పయనిస్తే

తరతరాల భవిష్యత్తుకు

తరగని నిధిఐ వెలుగుతుంది!


కలలుకంటు కాలంగడపక

నిర్ధిష్టకాంక్షతో పోరాడు

ప్రతిఫలం నీకే సొంతం

విజయమే నీలోదీపం!


స్వార్ధచింతన కొంతమాని

కోరికలు చంపుకొని

కొత్తమార్గం ఎంచుకొని

సాధించు నీ లక్ష్యం!


ప్రసాదు యంవివి(సాదు)

కల్లూరు, ఖమ్మం జిల్లా

కామెంట్‌లు లేవు: