20, సెప్టెంబర్ 2022, మంగళవారం

పృధ్వీలింగం( కాంచీపురం)🙏

 https://www.facebook.com/100043481421388/posts/pfbid02K3o6EiCJjy9k2UAhFcZGjUWw7A7LDT7BHgR4jKv5B6JBm3wsG7u7ma5QsaRh8cxSl/

🙏ఏకామ్రేశ్వరుడు-- 

పృధ్వీలింగం( కాంచీపురం)🙏


🙏🌹🙏🌹🙏🌹


పంచభూతలింగాలలోని "పృధ్వీలింగం"గా పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాంచీపురంలోని "ఏకామ్రేశ్వరుని" దేవాలయం. 


దక్షిణభారతదేశంలోని అతి పురాతనమయిన పట్టణాల లో "కంచి" ఒకటి.చెంగల్పట్టు నుండి అరక్కోణంకు  ఉన్న రైలుమార్గంమధ్యలో ఈ పట్టణం ఉంది. తిరుపతి నుంచి కంచి 110 కి.మీ దూరంలో ఉంది.

              శ్రీ చక్రస్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు కంచిలోని "శ్రీకామాక్షిదేవి" ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.దాదాపు వంద దేవాలయాలతో స్వర్ణనగరంలా విలసిల్లే కాంచీపురం వైష్ణవులకూ,శైవుల కూ ఆరాధ్య మైనది. బ్రహ్మ యజ్ణంచేసి "వరదరాజ" రూపంలో విష్ణువును వెలయింపజేసిన తపోభూమి ఇది.


ఇక్కడనే పార్వతిదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు మామిడిచెట్టు రూపంలో వెలిసినట్లు భావించి సేవించిం దని ప్రతీతి. ఆచోటనే "ఏకామ్రేశ్వర దేవాలయం" ఉంది. ఇది కంచిలోని అన్ని ఆలయాలకన్నావిశాలమైనది,  ప్రాచీనమైనది.ఇక్కడ గొపురాలు,ప్రాకారాలు స్థంభాలు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. 

 

                       శివ రూపంలో వెలిసిన ఇక్కడి మామిడిచెట్టు 3500 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. ప్రస్తుతం ఈ మామిడివృక్షం యొక్క  కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.


స్థలపురాణం.....

పార్వతిదేవి శివునికన్నులు మూయడం, అందువల్ల  జరిగిన పరిణామాలు వలన పార్వతిదేవి తపస్సుకు బయలుదేరడం , ముందుగా కాశిలో తపస్సు చేయడం, అక్కడనుంచి కంచివచ్చి మామిడి చెట్టుక్రింద సైకిత లింగంచేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం, తత్ఫలితంగా శివుని జటాఝూటం నుండి గంగానది పోంగడం, పార్వతిదేవి ఇసుకతో చేసిన లింగం కోట్టుకునిపొకుండా ఆలింగనం చేస్కోవడం, శివుడు సంతొషించి అనుగ్రహించడం,  అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అర్దనారీశ్వరులుగా ఏకమవడం అందరికీ తెలిసినదే కదా! అందువలన ప్రస్తావించలేదు.


        ఇక్కడి ఏకామ్రేశ్వరలింగం "పృధ్వీలింగం" కనుక ఇక్కడి మట్టికూడా చాలా గొప్పదంటారు. ఈ క్షేత్రంలో చేసిన మంచిపని ఏదయినావెంటనే  ఫలిస్తుందనీ,అది నానాటికీ పెరుగుతుందని కూడా అంటారు.


 కంచిలో ఉండటానికి వసతికి, భోజనానికి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ గుడికి అందుబాటులోనే ఉంటాయి.


🙏🌹🙏🌹🙏🙏

కామెంట్‌లు లేవు: