ఆత్మదర్శనం కావాలంటే ముందు నీలోనున్న ఆరు శత్రులను విడనాడు ...???
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం
పశ్యతి సోహం
ఆత్మజ్ఞాన విహీనా మూఢా
స్తేపచ్యన్తే నరక నిగూఢా
కామ,
క్రోధ, లోభ, మోహ గుణాలను
విసర్జించి, పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం
కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు
మూఢులై, ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి
బాధలు అనుభవిస్తారు.
అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఈ ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. ఏ కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి
సేకరణ సి. భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి