అశ్వత్థామ వదిలినది బ్రహ్మశిరోనామక అస్త్రం,
నువ్వుకూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు అని అర్జునిడికి
బోధించాడు కృష్ణుడు.
వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించి
అశ్వత్థామను బంధించి తీసుకువచ్చి
ద్రౌపది ముందు నిలబెట్టాడు అర్జునుడు.
అంత శోకంలోనూ అశ్వత్థామకు నమస్కరించి ,
ద్రౌపది సంధించిన ప్రశ్నలివి......
*****
భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధ వీరభట సందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ!
**
ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్,
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?
**
తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు.
**
ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; ఏ చిన్న అపకారం కూడా ఆ చిన్నిపాపలు నీకు చేయలేదే; అటువంటి వాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను, కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?...
🏵️పోతన పద్యం🏵️
🏵️కరుణ రసాత్మకం🏵️

**************************
1 కామెంట్:
Good message
కామెంట్‌ను పోస్ట్ చేయండి