18, ఆగస్టు 2024, ఆదివారం

తొలి ఉత్తరం!

 *కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల*

*తన తల్లికి వ్రాసిన తొలి ఉత్తరం!*            


“అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను.


ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.


కానీ, ఈరోజు నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే ఒక అందమైన పూలపానుపు కాదు అని!


కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని, నాకు అర్ధం అయింది.!


నేను ఊహించిన దాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.


నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు.


మన ఇంట్లో లాగా నైట్ దుస్తులతో, పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది.


నీ దగ్గర ఉన్నప్పుడు, పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు.


నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునే వారు ఇక్కడ లేరు కానీ, నేను మాత్రము అందరి గురించి చాలా శ్రధ్ధ తీసుకోవాలి.


అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా! అని ఏడుపు కూడా వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలు పోవాలని, మళ్లీ హాయిగా వుండాలని అనిపిస్తుంది.


మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు, సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.


కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది, నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని, నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు, సేవలు చేసే ఉంటావు కదా!


నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాలన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళీ నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది.


నేను చెప్తున్నా అమ్మ, కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే, నా ఈ కొత్త కుటుంబాన్నీ, కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను.


నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.


అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి.


థాంక్ యూ అమ్మా! 

ఐ మిస్ యు!!


*రేపు రాఖి పండుగ సందర్బంగా మహిళలందిరికి కృతఙ్ఞతలతో!*

కామెంట్‌లు లేవు: