10, డిసెంబర్ 2022, శనివారం

బలవంతుడ్ని

 శ్లోకం:☝️

  *బహవో న విరోద్ధవ్యాః*

*దుర్జయాస్తేఽపి దుర్బలాః ।*

  *స్ఫురన్తమపి నాగేన్ద్రం*

*భక్షయన్తి పిపీలికాః ॥*


భావం: నేను చాలా బలవంతుడ్ని, నాకేమి భయం లేదని విర్రవీగి ఒకే సమయంలో చాలా మందితో విరోధించకూడదు. వారు బలహీనంగా ఉన్నప్పటికీ బలీయంగా మారతారు. బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేతజిక్కి చావడం లేదా?

సుమతీ శతకకారుడికి ఈ శ్లోకమే ప్రేరణ అయ్యుంటుంది.

_బలవంతుడ నాకేమని_

_పలువురితో నిగ్రహించి పలుకుట మేలా_

_బలవంతమైన సర్పము_

_చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!_

కామెంట్‌లు లేవు: