22, జూన్ 2024, శనివారం

అల్లుడి కాళ్ళెందుకు కడగాలి. ?

 🙏🙏🙏🙏🙏

వివాహ సమయంలో

అల్లుడి కాళ్ళెందుకు కడగాలి. ?

భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తన కంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి, ఆ నీటిని తన తలమీద, భార్య తలమీద చల్లుకోవడం తెలిసిందే. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. 'సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీమహాలక్ష్మీ స్వరూపి శ్రీం కన్యామ్' అనేది వివాహమంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా, వయసుఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాలనుంచి గంగపుట్టింది కనుక ఇతడి పాదాలనుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తలమీదచల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లికూతురు మహాలక్ష్మీ స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్లికూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్లాలని, అందువల్ల శ్రీలక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్దులంటారు.

(సేకరణ)

🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: