22, జూన్ 2024, శనివారం

షట్ బేర ఆరాధన

 🙏🪷🙏🪷🙏

షట్ బేర ఆరాధన - సింహాచలం 


సింహాచల దేవాలయం పాంచరాత్ర ఆగమ విధాన వైష్ణవ సాంప్రదాయ దేవాలయం. దేవాలయంలో షట్ బేర ఆరాధన విధానము ఉన్నది.


1. ధ్రువ బేరం : మూల విరాట్ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి - గర్భాలయంలో మనం చూసే స్వామి.


2. స్వపన బేరం : యోగ నృసింహ స్వామి - అభిషేక కార్యక్రమాలు ఈ మూర్తికి జరుగుతాయి 


3. శయన బేరం : వేణుగోపాల స్వామి - ప్రతీ రోజూ శయన ఉత్సవం ఈ మూర్తికి జరుగుతుంది . రుక్మిణీ సత్యభామా సమేతుడై స్వామి ఉంటారు.


4. కౌతుక బేరం : మదన గోపాల స్వామి - ఈ మూర్తి లోనికి ద్రువ మూర్తి నుంచి కళావాహన, ఉపసంహరణ జరుగుతాయి. పూర్వం ఈ మూర్తి స్వామి పక్కనే ఉండేది అట. ఏకాదశి దినాల్లో ఈ స్వామికి తిరువీధి జరుగుతుంది.


5. ఉత్సవ బేరం: గోవింద రాజస్వామి - చందనోత్సవం తప్ప దేవలయంలో జరిగే అన్ని ఉత్సవాలు ఈ మూర్తికే జరుగుతాయి. స్వామి మందహాసం తో , చేతులకు, కాళ్ళకు నఖముల తో ప్రత్యేకముగా బహు సుందరంగా ఉంటారు. స్వామి ఆపాద మస్తకము వర్ణన చేస్తూ ఎన్నో కావ్యాలు ఉన్నాయి. 


6. బలి బేరం : బలి నారాయణుడు ( చక్ర పెరుమాళ్) - విశేష హోమాలు, బలిహరణలు ఈ మూర్తికి జరుగుతాయి. సింహాచలంలో ఈ మూర్తి చాలా అరుదు అయినది. స్వామి 16 భుజాలతో ఉంటారు.


ధ్రువ, స్వపన బేరాలు గర్భాలయంలో చూడవచ్చును. మిగిలినవి భోగ మండపం ఇరువైపులా ఉన్న చిన్న అద్దాల నిర్మాణాలలో ఉంటాయి. 


సింహగిరి నరహరి నమో నమో దయానిధి.

🙏🪷🙏🪷🙏

కామెంట్‌లు లేవు: