🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🌼శుభోదయం🌺
🏵️ నేటిపెద్దలమాట 🏵️
ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి.
మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారికి చాలా అవసరం.
🌹 నేటిమంచిమాట 🌹
సమాజ సేవకు గంధపు చెక్కగా ఉపయోగపడాలి గానీ, తుప్పు పట్టిన ఇనుప ముక్కలా అడ్డం పడకూడదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 01 - 08 - 2024,
వారం ... బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం - బహుళ పక్షం,
తిథి : ద్వాదశి సా4.18 వరకు,
నక్షత్రం : మృగశిర మ12.13 వరకు,
యోగం : వ్యాఘాతం మ3.24 వరకు,
కరణం : తైతుల సా4.18 వరకు,
తదుపరి గరజి తె4.00 వరకు,
వర్జ్యం : రా8.38 -10.14,
దుర్ముహూర్తము : ఉ9.58 - 10.49,
మ3.05 - 3.57,
అమృతకాలం : రా2.14 - 3.51,
రాహుకాలం : మ1.30 - 3.00,
యమగండం : ఉ6.00 - 7.30,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.42,
సూర్యాస్తమయం: 6.31,
*_నేటి మాట_*
⚜️ *జీవితం-మరణం* ⚜️
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి, మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే ! నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం.
కానీ, మనిషి దీన్ని గుర్తించడు,
మరణమనే మాటనే జీర్ణించుకోలేడు.
ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు.
ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది.
కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు.
‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు.
ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు.
‘ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు..
ఆ వ్యక్తి ...
‘భగవాన్ నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు.
నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’ అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి.
ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, దైవం అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’.
‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు.
అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’
శరీరమున్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు, సత్కర్మలలో పాల్గొను,
ఆర్తిక శక్తి చాలకపోతే,
చెవుల ద్వారా మంచిని విను,
కళ్ళ ద్వారా మంచిని చూడు,
నోటి ద్వారా మంచి పలుకు,
కాళ్ళను మంచి వైపుకి నడిపించు, చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయు...
అందుకే !!...
*శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు.*
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి