27, సెప్టెంబర్ 2020, ఆదివారం

రామనామం మహా పవిత్రమైంది

 *🌻శ్రీరామ జయరామ జయజయ రామరామ!*🌻


రామనామం మహా పవిత్రమైంది. రామనామ మహిమకు అటు ఆధ్యాత్మిక, ఇటు వైజ్ఞానిక కారణాలు ఎన్నో ఉన్నాయి. రామనామాన్ని అధికంగా ఉచ్చరించడం ద్వారా వ్యక్తిలో తేజస్సు పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉత్పన్నమవుతుంది. తమకు అధికార సిద్ధి పరిపూర్ణంగా కలుగుతుంది. అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.


భారతీయ మంత్రశాస్త్రం ప్రకారం అక్షరాలలో ‘రం’ అనేది అగ్ని బీజాక్షరం. దీనిని ఉచ్చరిస్తూ ఉంటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే, రామ తారక మంత్రంలోనూ అన్నీ రేఫలే (ర) ఉంటాయి. చాలామంది దేవతల పేర్లలోనూ ‘ర’ అనేది లేకుండా ఉండదు. ఉదాహరణకు శంకర, రమా, అపర్ణ, సరస్వతి, పార్వతి, సుబ్రహ్మణ్య, గాయత్రీ, ఈశ్వర మొదలైనవి చాలా ఉంటాయి. భాషాశాస్త్రం ప్రకారం ‘రం’ అక్షరాన్ని ‘ట్రిల్స్‌' అంటారు. ఈ అక్షరాన్ని ఉచ్చరిస్తుంటే మన నాలుక కొన్ని వేలసార్లు కంపనాలు పొందుతుంది. ఆ కంపనాలు నరాల వ్యవస్థ ద్వారా శరీరంలో అంటుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. దానివల్ల శరీరంలోని వేర్వేరు ‘బ్లాక్స్‌' క్రమంగా కనుమరుగవుతాయి. 


శరీరంలోని అన్ని వ్యవస్థలలోని ‘బ్లాక్స్‌' తొలగిపోవడమే ‘పాపం’ దూరం కావడం. అందులోను దైవనామం బాహ్యోచ్చారణ చేసినా, అంతరోచ్చారణ చేసినా పాపనాశనమే అవుతుంది. బాహ్యోచ్చారణ ద్వారా ప్రత్యక్షంగా, అంతరోచ్చారణ ద్వారా పరోక్షంగా శరీర, మానసిక శుద్ధి కలుగుతుంది. నామాలకు ‘జయ జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా అది ‘జయాంతమాల’ అవుతుంది. ఇటువంటివి మంత్రశాస్త్రంలో వేర్వేరుగా ఉంటాయి. శ్రీరామ శబ్దానికి ‘జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా సర్వకార్య విజయానికి, అధికార సిద్ధికి, ఆనంద ప్రదమైన, ఆరోగ్య ప్రదమైన జీవనానికి హేతువు అవుతుంది. అందుకే, ప్రతిరోజూ ‘శ్రీరామ జయరామ జయజయ రామరామ’ అనే జపాన్ని చేద్దాం. అన్ని సమస్యలను పరిష్కరించుకునే శక్తిని పెంచుకుని, విజయాన్ని సాధించి ఆనందంగా జీవిద్దాం.


జై శ్రీరామ్




🌻🌼🌻🌼🌻🌼🌻🌼🌻

కామెంట్‌లు లేవు: