27, సెప్టెంబర్ 2020, ఆదివారం

సూర్యారాధన

 🙏శుభమస్తు, శుభోదయం🙏 సూర్యారాధన ఈ జగతిన అత్యంత కీలకం ! సకల చరాచర జీవరాశి ప్రశాంత మనుగడకు ' భాస్కర స్నేహ బంధం ' ! విశ్వ జీవజాలపు నిత్య సానుకూల చైతన్య జీవనాధారం, భాస్కర కిరణ స్పర్శ ! మార్తాండుని ఆప్యాయతానురాగాలతో ప్రకృతి ఒడిలో అద్భుత ఆవిష్కరణ ! మాతృమూర్తి ద్వారా ఓనమాలు నేర్చిన జీవి, ప్రకృతి ఒడిలో బ్రతుకు బాట పట్టడం సహజం ! ప్రాతఃకాలపు కుక్కుట నాద ఝరితో మేల్కాంచెడి ప్రకృతి, అనుక్షణం సన్మైత్రికి ప్రతీకగా నిలవడం విశేషం ! ఈ పవిత్ర పృధ్విపై ప్రతి జీవి నేర్వాల్సిన నిత్య జీవన స్ఫూర్తి, సుస్నేహ మాధుర్యపు చైతన్య స్రవంతి ! సూర్య భగవాన్ కృపతో ఈ విశాల విశ్వంలో త్వరితగతిన సుస్నేహ వాతావరణం సిద్ధించాలని ఆశిద్దాం ! " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయా ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! " ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: