22, మే 2021, శనివారం

భరోసా ఇస్తే

 కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు గురించి ఫేస్ బుక్ టైమ్ లైన్ లో కొంతమంది డాక్టర్లు పెట్టిన పోస్టులను చూసిన తర్వాత తలెత్తిన ప్రశ్నలు.. 


కృష్ణపట్నం ఆయుర్వేద ముందుకి ప్రామాణికం ఏంటి అని అడుగుతున్నారు కొందరు డాక్టర్లు..??

మరి డాక్టర్లు చేస్తున్న ట్రీట్మెంట్ కి ప్రామాణికం ఏంటి..??


*ప్లాస్మా థెరపీ* అన్నారు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.. ఇప్పుడు తూచ్ అది కరెక్ట్ కాదు అంటున్నారు. 


*రెమిడీశ్వర్* అన్నారు... కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.. ఇప్పుడు తూచ్ అది కరెక్ట్ కాదు అంటున్నారు. 


మరి ప్రామాణికం ఏంటి..?? 


ఈ రోజు బ్లాక్ ఫంగస్ పడగ విప్పింది అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లలో డిస్టిల్డ్ వాటర్ పోయాలి మామూలు వాటర్ కాదు అనే కనీస అవగాహన కూడా లేని కొందరి డాక్టర్ల వల్ల కాదా..!! ఎప్పుడైతే బ్లాక్ ఫంగస్ ఆ నీటి వల్ల వస్తుంది అని వార్తలు వచ్చాయో అవి చూసి నీతులు చెప్తూ పోస్టులు పెట్టే వారున్నారు.


అంతర్జాతీయ మీడియాలో ఆ మందు కరెక్ట్, ఈ మందు కరెక్ట్, ఆ ఇంజెక్షన్ కరెక్ట్ అంటూ వచ్చే వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు తప్పించి ఇది కరెక్ట్ మెడిసిన్ అంటూ దేనినైనా చెప్పగలుగు తున్నారా.


నిజానికి కోవిడ్ అనేది అందరికీ ఔట్ ఆఫ్ సిలబస్ టాపిక్.. ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న పరీక్షలో వస్తే ఆ ప్రశ్నని అటెంప్ట్ చేస్తే చాలు మార్కులు వేసేస్తారు అనే ఉద్దేశంతో అటెంప్ట్ లు జరుగుతున్నాయి తప్పించి ప్రామాణికం అయి మాత్రం కాదు.. 


చివరగా.. కృష్ణపట్నం మందు తీసుకున్న వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించే వారికి.. ఇప్పుడు హాస్పిటళ్లల్లో చనిపోతున్న వేలాది మందికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో కూడా చెప్తే బాగుంటుంది.. ఈ డాక్టర్లలు మేము బాధ్యత తీసుకుంటాం.. పేషంట్ చనిపోడు మేము కాపాడుతాం అనే భరోసా ఇస్తే ప్రజలకు ఇంకేమి కావాలి..??


🤔🤔

కామెంట్‌లు లేవు: