వెల్లుల్లి ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .
వెల్లుల్లి మిక్కిలి ఉష్ణమును పుట్టించును . కఫ , వాత , శ్లేష్మములను , సూతికా , సన్నిపాతము , శీతల వాతము , వాత పురాణ జ్వరములను , శూల , అగ్నిమాంద్యము , అరుచి , అజీర్ణవికారములు , నంజు రోగములు , కడుపులో బల్లలు , ఉదరములు , గుల్మ , శ్వాస , కాస , మూలరోగములు , క్షయ , కుష్టు మున్నగు వానిని నివారించును.
యునాని వైద్యము నందు ఈ వెల్లుల్లితో లేహ్యములు , షర్బత్తులు మొదలైన వాటిని యునాని వైద్యులు విస్తారంగా తయారుచేసి వాడుదురు . సర్వాంగవాతములు , ఆమవాత , పక్షవాతములు , తలతిప్పుట , నరముల రోగములు పోగొట్టి ఆకలిని , అగ్నిదీప్తిని , కాంతిని , బలమును కలుగచేయును . వీర్యవృద్ధి , ఆయుర్వృద్దిని కలుగచేయును . రక్తశుద్దిని కలుగచేయును . కడుపులోని దుర్వాతములు , స్త్రీల రజో , రక్త సంబంధ దోషములు , మూత్రబద్ధకములు దీనివలన నెమ్మదించును. వెల్లుల్లిపాయలు మరియు మేకపాలతో కలిపి చేసిన లేహ్యము మిక్కిలి ధాతుపుష్టి కలిగించును. ఈ పాయలను నూనెలో కాచి చల్లార్చి దానిని చెవిలో పోసిన కర్ణరోగములు , చెవుడు మొదలైనవి హరించును . ఈ తైలమును పక్షవాతమునకు మర్దన చేయవచ్చు . విషములు హరించును . చిడుము మొదలైన చర్మరోగములు నశించును. లోపలికి పుచ్చుకున్న బహుమూత్రములు కట్టును .
వెల్లుల్లి గడ్డలను కుమ్ములో ఉడికించి తినిన మూలవ్యాధులు నశించును. వెల్లుల్లి రసమును పూసినను లేక ఉప్పుతో నూరి కట్టినను గాయములు , బెణుకులు , వాత , మేహ వాతపు పోట్లు , కీళ్లపోట్లు నశించును. లోపలికి పుచ్చుకున్నచో ఉబ్బసరోగులకు వాత , పక్షవాత రోగులకు ఇది చాలా హితకరము .
గమనిక -
దీనిని ఎక్కువ మోతాదులో , అతిగా వాడరాదు . అతివేడి కలిగించును. రక్తపిత్తము కలిగించును. మగతనం నశింపచేయును . మూలరోగము , గ్రహణి , రక్తవిరేచనాలు కలిగించును. దీనికి విరుగుళ్లు నెయ్యి , పులుసు , పాలు , ఉప్పు . వీటితో కలిపి వండిన దోషము నశించును.
మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి