దేశ విభనకు ఒప్పుకున్న తరువాత జరగబోయే సంఘటనలు ఊహించడం లో కానీ వాటిని ఎదుర్కోడానికి సరైన ప్రణాళికలు రచించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు నాటి పెద్దలు.
పర్యవసానం?
కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోత కాబడ్డారు. ఎంత మంది చనిపోయి వుంటారో లెక్కలు కూడా లేవు. పాకిస్తాన్ లో ఉండే హిందూ, సిఖ్ నిరుపేదలే కాదు కోటీశ్వరులు కూడా ఆస్తులు అన్ని వదలుకొని కట్టుబట్టలతో భారత్ కు కాందిశీకులు గా బయలుదేరారు.
మనం దక్షిణాది వారం అదృష్టవతులం.
ముఘల్ దండయాత్రల అప్పుడు కానీ దేశ విభజన జరిగినప్పుడు కానీ, చైనా దండయాత్ర అప్పుడు కానీ మనం ఉత్తరాది వారు అనుభవించిన కష్టాల్లో ఒక్క శాతం కూడా అనుభవించలేదు. అందుకే మనకు దేశభక్తి, హిందూ పదం అంటే అంత నిర్లక్ష్యం.
లక్షల మంది హిందువులు పాకిస్తాన్ లో అన్ని వదులుకుంది కి సిద్ధపడ్డారు కానీ మెడ మీద కత్తి పెట్టినా తమ హిందూ ధర్మం వదులుకోడానికి సిద్ధపడలేదు..
అందుకే అక్కడ వారికి హిందుత్వం అన్నా, భారత మాత అన్నా ఒక బంధం, ఒక ఉద్వేగం. అందుకే ఈ దేశభక్తి, హిందూ పిలుపులకు వారు స్పందించినంతగా మనం స్పందించలేము. దక్షిణాది తో పోలిస్తే అందుకే ఉత్తరాదిలో మత మార్పిడులు కూడా తక్కువ.
నిన్నటి రోజు అంటే ఆగస్టు 14 గా తేదీని 75వ స్వాతత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ #PartitionHorrorsRemembranceDay గా గుర్తించారు. అలా పాత సంఘటనలను తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? వాటిని మరిచి పోయి ముందుకు సాగాలి ఆని మేధావులు సూక్తులు చెపుతున్నారు. మొఘల్ పాలకుల అకృత్యాలు మీద వీరిది అదే వైఖరి. కానీ వీరి యేజెండాకు సరిపోయే హిందూ ధర్మంలో వివక్ష, 2002 గోధ్రా వంటి సంఘటనలు మాత్రం రోజూ గుర్తు చేసుకుంటూ జనల మనసుల్లోంచి పోకుండా జాగ్రత్త పడతారు.
పాత ఘోర సంఘటనల వల్ల ఇబ్బంది పడ్డ సమూహం వాటిని గుర్తు పెట్టుకొని అవి ఎందుకు జరిగాయి వాటి వల్ల జరిగిన నష్టం ఏమిటి అని ఆలోచిస్తేనే అటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా యే చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. తరువాత తరాలు కూడా బాధ్యతాయతంగా మెలుగుతారు.
సరే! నోట్ల రద్దు అప్పుడు వేల మందిని క్యులలో నిలబెట్టారు, వందల మంది(ఎక్కడా ఆధారాలు లేకపోయినా) చనిపోయారు అందుకు నేటి పాలకులను శిక్షించాలి అనే పెద్దలు, 2002 లో రెండువైపుల వారు మత ఘర్షణలో వెయ్యి మంది చనిపోతే పాలకులపై అన్ని రకాల సంస్థలతో దర్యాప్తు చేయించాలి అని కోరిన మేధావులు యే ముందస్తు ప్రణాలికలు లేకుండా దేశాన్ని అడ్డంగా విభజించి లక్షల మంది చావుకి కారణం అయి, కొన్ని లక్షల మందిని కాందిశీకులుగా మార్చిన అప్పటి పాలకులపై యే విచారణలు లేవు, యే చర్యలు లేవు. లక్షల మంది చనిపోయినా స్వాతంత్య్ర సంగ్రామం అహింసాయుతంగా నడిపారు అని పై పెచ్చు వారు మహాత్ములు గా దేశ నిర్దేశకులుగా కీర్తింపబడ్డారు.
విభజన అప్పుడు ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ.
తమ ప్రాణాలు నిలుపుకుందికి అప్పుటి వారు ఎంత నరక యాతన అనుభవించారు ఈ తరం వారు తెలుసుకోడానికి ప్రత్యక్ష సాక్షుల కథనాలు నేను కొన్ని భాగాలుగా ఇస్తాను.
.... శాస్త్రి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి