1, జులై 2020, బుధవారం

ఆత్మావలోకనం (రెండు కట్టెలు)

యథా కాష్టా౦చ కాష్ట౦చ
సరుయేతాం మహోదదే
సమత్వ చవ్యపే ఏతాం
తద్యద్భూత సమాగ మమ్.

''సముద్రంలో కొట్టుకొస్తున్న రెండుకట్టెలు తడిసి ,
ఒకదానికి ఒకటి అంటుకుపోతాయిఅలాకొంత దూరం
జంటగా వెళ్ళాకఅలల తాకిడికివిపరీతమైన గాలికి ,
అవి మళ్ళీ విడిపోతాయిఒకటికిఒకటి దూరమై మళ్ళీ కలసుకోవు.

మన ఆర్యులు చిన్న చిన్న శ్లోకాలలో యెంతో నిగూఢ అర్ధాలతో మన మేధస్సుకి పదును పెట్టె టటువంటివి 
మన హిందూ వాగ్మయంలో కోకొల్లలు. ఈ శ్లోకం చుడండి యెంత చిన్నగా వుంది అనంతమైన జీవిత పరమార్ధాన్ని చెప్పుతున్నది.   
ఇక్కడ కట్టెలు అంటే రెండు జీవితాలు అవి సముద్రములో కొట్టుకొని వస్తువున్నాయి అంటే కాల ప్రవాహంలో కొట్టుకొని వస్తువున్నాయి అంటే ఒక జీవి ముందుగా వున్నది దానికి ఇంకొక జీవి కాల ప్రవాహంలో కొట్టుకొని వచ్చి కలిసి వున్నది అంటే.  ముందుగా వున్న నీ తల్లితండ్రులు మొదలైన పెద్దవారితో నీవు కాల ప్రవాహంలో కొట్టుకొచ్చి కలిసి వున్నావు.  తరువాత భార్య, పిల్లలు అనే కట్టెలు నీ కట్టెకు కొంత కాలం కలిసి ఉన్నతాయి.  అంతా కాల ప్రవాహంలో కొంతకాలమే కలిసి ఉంటాయి తరువాత కాల ప్రవాహంలో వేటికి అవే విడిపోతాయి. చివరికి ఏ కట్టెకు ఆ కట్టే మిగిలివుంటుంది.  తరువాత అది కూడా నాశనం అయి పోతున్నది. ఇప్పుడు చెప్పండి మన జీవితంలో కొంత కాలం కలిసి వుండే ఈ కాల సముద్రంలో మనం విడిపోతాం అని తెలిసికూడా ఒక కట్టమీద ఇంకొక కట్టెకు మమకారం, వ్యామోహం, వ్యాకులత, చింత ఎందుకు.  ఎట్లాగో ఆ కట్టే అంటే సంబంధం కొంత కాల ప్రవాహం తరువాత విడిపోయేదే కదా. ఈ ఒక్క శ్లోకం చాలు మనిషిని అద్వయితం  వైపు మళ్లించటానికి. ఇది నాది, వీళ్ళు నా వాళ్లు  వాళ్లు పరాయి వాళ్ళు అనే భావన యెంత ముర్కమైనదో అని అనిపిస్తుంది. కేవలం కొంత కాలం కలిసి వుండే కొట్టుకోవచ్చిన కట్టెల వంటి వాళ్ళం అనే నిజం తెలుసుకుంటే ప్రతి మనిషి మనస్సులో ఆధ్యాత్మిక భావనాలు కలుగుతాయి. జిజ్ఞాసువులుగా మారుతారు. మోక్షార్థులు  అవుతారు. చివరికి మోక్షాన్ని పొందుతారు.   
అహంభావానికి  కొంతమంది ఆత్మాభిమానం అనే ముసుకు వేసుకుంటారు.  తానే గొప్ప వాడని, తనకే అన్ని తెలుసని. అందరిని చిన్న చూపు చూస్తూ అందరికి కంటు అవుతారు.  వినయ విదేతలు వున్నవారు అందరిని కలుపుగోలుగా కలుపుకొని తాను ఉన్న స్థితిని ఇతరులు గుర్తించేరట్లు ప్రవర్తించి నలుగురికి మంచి నేర్పుతారు తానూ మంచి నడవడిక కలిగి వుంటారు. అహంభావాన్ని వీడటమే ముముక్షువు చేయవలసిన మొదటి సాధన.  
అందరు జిజ్ఞాసువులు గా మారాలని ఆకాంషించే 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 



కామెంట్‌లు లేవు: