69ఫ4;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*69ఫ5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀`*ఈరోజు సాధకులకు మంచి కాలం.`
*మోహరాత్రి ఉపాసన*
➖➖➖✍️
భగవంతుడిని చేరుకోవడానికి వీలులేకుండా `మనస్సును మాయా ప్రపంచంలోని విషయాసక్తుల వైపు నడిపిస్తూ, జనన–మరణ సంసార బంధంలో మనిషిని తిరిగి తిరిగి తిప్పే ప్రధాన కారణాలలో ‘మోహం’ ఒకటి.`. ```
మోహం అంటే కేవలం ఒక వ్యక్తి లేదా వస్తువుపై ఉండే ఆకర్షణ మాత్రమే కాదు. శరీరమే నేను, సంపదే శాశ్వతం, సంబంధాలే అన్నీ, ఇంద్రియ సుఖాలే జీవిత పరమార్థం అనే భ్రాంతి కూడా మోహమే!
ఈ మోహాన్ని అధిగమించి మనస్సును భగవంతుని వైపు మళ్లించడమే నిజమైన ఆధ్యాత్మిక ‘సాధన.’```
*భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ —
*“దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।*
*మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥”*```
(భ.గీ.7-14)
అని ఉపదేశించాడు.
అంటే, ‘త్రిగుణమయమైన నా మాయను అధిగమించడం సులభం కాదు. అయితే నన్నే శరణు పొందినవారు ఆ మాయను దాటగలరు’ అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు.
అందుకే సాధకుడు తన మనస్సును మాయా విషయాల నుంచి మరల్చి భగవన్నామ స్మరణలో నిలపాలి.
కలియుగంలో భగవన్నామ కీర్తనకు విశేషమైన ప్రాధాన్యం ఉందని శ్రీమద్భాగవతం తెలియజేస్తుంది:```
*“కలేర్దోషనిధే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణః ।*
*కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్ ॥”*```
కలియుగం అనేక దోషాలతో కూడి ఉన్నప్పటికీ, ఒక గొప్ప విశేషం ఉంది. శ్రీకృష్ణుని నామసంకీర్తన ద్వారా బంధనాల నుంచి విముక్తి పొంది పరమగతిని చేరవచ్చు అనే మహత్తరమైన భావాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.
అందువల్ల ఈ రోజు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని శ్రీకృష్ణ నామస్మరణకు కేటాయించండి. ప్రత్యేకంగా కూర్చోవడం సాధ్యంకాకపోయినా, మన పనులు చేసుకుంటూనే మనస్సులో భగవన్నామాన్ని స్మరించవచ్చు.
అవకాశం ఉన్నవారు శ్రద్ధతో జపించవచ్చు; వినడం ద్వారా కూడా భగవంతుని స్మరణలో మనస్సును నిలపవచ్చు.
🙏 శ్రీకృష్ణ నామస్మరణ..```
*కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే।*
*ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ॥*
*భావం:*```
వాసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణునికి, సమస్త జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకు, శరణు పొందినవారి క్లేశాలను తొలగించేవాడైన గోవిందునికి మరల మరల నమస్కారం.🙏
```
*“కృష్ణాయ”* —```
అందరినీ తనవైపు ఆకర్షించేవాడు.```
*“వాసుదేవాయ”* — ```
వాసుదేవుని కుమారుడు, సర్వవ్యాపకుడైన పరమాత్మ.```
*“హరయే”* — ```
పాపం, దుఃఖం, బంధాలను హరించేవాడు.```
*“పరమాత్మనే”* — ```
సమస్త హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడు.```
*“క్లేశనాశాయ”* — ```
శరణాగతుల కష్టాలను తొలగించేవాడు.```
*“గోవిందాయ”* — ```
భక్తులకు ఆనందాన్ని, రక్షణను ప్రసాదించేవాడు.
ఈ నామాన్ని భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ మనస్సులోని మోహం, అహంకారం, విషయాసక్తి క్రమంగా తొలగి భగవద్‌చింతన, భక్తి, వైరాగ్యం, శరణాగతి పెరగాలని కోరుకుందాం.
మోహాన్ని జయించి మాధవుని చేరే మార్గంలో ప్రతి అడుగు ఒక సాధనగా మారాలి.✍️```
*కృష్ణం వందే జగద్గురుమ్*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖మంత్రాలు*
➖➖➖✍️
*1. క్లీం కృష్ణాయ నమః*
`*ఇది స్వయంగా శ్రీకృష్ణుడు ఉపదేశించిన మూలమంత్రంగా చెప్పబడుతుంది. దీనిని జపించడం వల్ల నిలిచిపోయిన ధనం తిరిగి లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా, ఈ మూలమంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు.`
*2. ఓం శ్రీం నమః శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా*
`*ఇది శ్రీకృష్ణుని సప్తదశాక్షర మహామంత్రం. ఇతర మంత్రాలు శాస్త్రోక్త విశ్వాసాల ప్రకారం 108 సార్లు జపించడం ద్వారా సిద్ధిస్తాయని చెబుతారు. అయితే ఈ మహామంత్రం ఐదు లక్షల సార్లు జపించినప్పుడే సిద్ధిస్తుందని విశ్వాసం. దీనివల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని చెబుతారు.`
*3. గోవల్లభాయ స్వాహా*
`*ఇది కేవలం రెండు పదాలుగా కనిపించినప్పటికీ, ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మంత్రాన్ని రూపొందించే ఏడు అక్షరాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉచ్చరించే సమయంలో ఒక్క అక్షరాన్ని కూడా సరిగ్గా పలకకపోతే ఈ మంత్ర ప్రభావం తగ్గిపోతుందని చెబుతారు.`
*4. గోకులనాథాయ నమః* `*ఎనిమిది అక్షరాలతో కూడిన ఈ శ్రీకృష్ణ మంత్రాన్ని జపించే సాధకుడి కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయని విశ్వాసం. ఆర్థిక, ఆధ్యాత్మిక, భౌతిక సుఖాలను పొందవచ్చని చెబుతారు.`
*5. క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః*
`*ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకునే సాధకులు ఈ మంత్రాన్ని జపిస్తారని చెబుతారు. ఇది సంపూర్ణ సిద్ధిని ప్రసాదించే మంత్రంగా భావించబడుతుంది. ఈ మంత్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, దానిని మరింత స్థిరంగా ఉంచుతుందని విశ్వాసం.`
*6. ఓం నమో భగవతే శ్రీగోవిందాయ*
`*ఇది వివాహానికి సంబంధించిన మంత్రంగా చెప్పబడుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వివాహం జరగకపోతే, ఉదయం స్నానం చేసిన అనంతరం ధ్యానంతో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలని చెబుతారు.`
*7. ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా*
`*ఈ మంత్రాన్ని ఉచ్చరించడం కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ, దీని ప్రభావం అద్భుతంగా ఉంటుందని విశ్వాసం. ఈ మంత్రం వాక్చాతుర్యాన్ని, వాక్కుకు సంబంధించిన వరాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.`
🌺*ముఖ్య గమనిక :- భీజాక్షరాలు ఉన్న 1,2,5,7 మంత్రాలు గురుముఖతః స్వీకరించాలి.*
🍀*1, 5,7 మంత్రాలు జపించాలనుకుంటే భీజాక్షరాలు లేకుండా జపించుకోవచ్చు.*✍️
🔺*కృష్ణాయనమః*
🔺*శ్యామలాంగాయ నమః*
🔺*కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి