*"భాగవతం వింటే బాగవుతాం"*
శ్రీ పోతన భాగవత మధురిమలు
(8-585-ఆ.)
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
*భావము:-* ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.
(ఇది *'శుక్ర నీతి'*. కేవలం రాక్షసులకు మాత్రమే వర్తిస్తుంది. సాక్షాత్తు శుక్రాచార్యులే చెప్పారు, యధేచ్ఛగా అబద్ధాలు ఆడుతూ కూడా పుణ్య లోకాలకు పోవచ్చు అనుకుంటారేమో!)
శ్రీ పురందరదాసు వారి తత్వ కీర్తనతో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి