17, ఫిబ్రవరి 2024, శనివారం

భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవుల;గన డెవ్వడట వానికంటె ప్రియుడు*

*నీకు లేడు, అయినను నిఖిలవిశ్వోద్భవ ; స్థితి విలయంబులకతన నైన*

*సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశి ; ష్టాత్మీయ మాయచే నజభవాది*

*వివిధభేదము లొందుదువు, స్వస్వరూంపంబు; నందుండుదువు, వినిహతవిమోహి*


స్వామీ! నారాయణా! విశ్వమంతా నీవే! నీకంటె వేరుగా జీవులు ఉన్నారు అనుకోవటం అజ్ఞానం. ఆ అజ్ఞానం లేనివారికంటె నీకు ప్రియమైనవాడు లేడు. అంటే నీకు జ్ఞానులంటే చాలా ఇష్టం. అయినా ఈ విశ్వమంతా ఏర్పడటానికీ, నిలిచి ఉండటానికీ, మళ్ళీ నీలో కలసిపోవటానికీ నీవే వేరువేరుగా రజస్సు, సత్త్వము తమస్సు అనే గుణాలతో కూడిన నీదే అయిన మాయతో బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ఇంకా పెక్కుదేవతలుగా రూపా లను పొందుతూ ఉంటావు. అయినా నీకు నీదయినజ్ఞానం ఏమాత్రమూ జారిపోదు. కనుక నిలువెల్లా కృపయే అయిన దేవా! లక్ష్మీపతీ! పద్మములవంటి కన్నులున్న ప్రభూ! అంతటా వ్యాపించి ఉండు సర్వాత్మకా! లోకాలనన్నింటినీ కాపాడే ఆదిదేవా! నిన్ను మాత్రమే భక్తితో,మిక్కిలి ప్రీతితో సేవకులమై కొలిచే మమ్ములను కాపాడు తండ్రీ!


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: