🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*చతుర్ధ స్కంధం*
*హారకిరీట కేయూర కంకణ ఘన ; భూషణుం డాశ్రితపోషణుండు*
*లాలిత కాంచీకలాపశోభిత కటి; మండలుం డంచిత కుండలుండు మహనీయ* *కౌస్తుభమణియుక్తమైన గ్రై ; వేయకుండానందదాయకుండు*
*సలలిత ఘనశంఖచక్రగదా పద్మ ; హస్తుండు భువన ప్రశస్తు డజుడు*
నాయనా! ధ్రువా! నారాయణుడు హారాలు, కిరీటమూ, బాహుపురులూ, వలయాలూ మొదలైన గొప్ప నగలతో అలంకరింపబడినవాడు. తనను ఆశ్రయించినవారిని పోషిస్తూ ఉంటాడు. చక్కని మొలత్రాడు పేటలతో శోభలను వెలువరిస్తున్న నుడుము కలవాడు. కాంతులతో అలరారుతున్న కుండలాలు కలవాడు. వెలకట్టరాని కౌస్తుభమణితో కూడియున్న కంఠంలో వ్రేలాడుతున్న సువర్ణహారం కలవాడు. అందరికీ ఆనందం అందిస్తున్నవాడు. అందచందాలతో ప్రకాశిస్తున్న శంఖము, చక్రము, గద, పద్మము చేతులందు ఉంచుకొన్నవాడు. అందువలననే ఆతనిని లోకులందరూ కొనియాడుతూ ఉంటారు. కమ్మని సువాసనలతో గుబాళిస్తున్న వనమాలను ధరించి ఉంటాడు. ఇన్ని మహావస్తువులు ఉన్నా దేనియందూ వ్యామోహంలేని మహాత్ముడు. ఎప్పటికప్పుడు క్రొత్త పట్టువస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చీలమండ దగ్గర మనోహరమైన అందియలు సొంపును పెంపు చేస్తున్నాయి. అతని సద్గుణాలను మించేవి సృష్టిలో మరెక్కడా ఉండవు. ప్రాణులందరికీ చూడముచ్చట అయినవాడు.
సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి