6, ఆగస్టు 2022, శనివారం

ప్రశ్నకు

 ప్ర. దేవి జగన్మాత, కరుణామయి - అంటారు కదా! జగములన్నిటికీ తల్లి అయిన దయామయి అయితే, జగతిలో భాగమైన రాక్షసులకు కూడా తల్లే కదా! మరి వారిని సంహరించడం న్యాయమా?

జ. ఈ ప్రశ్నకు కూడా మన శాస్త్రాల్లో స్పష్టమైన సమాధానముంది. జగతికి కారణమైన ఈశ్వర భక్తి కనుక 'జగన్మాత ' అన్నారు. అయితే పాపపుణ్యాలకు, మంచిచెడులకు  ఆ శక్తి కారణం కాదు. ఆయా జీవుల సంస్కారాలు. అయితే దుష్టులైన రాక్షసులు మొదలైన లోకకంటకులను సంహరించి, వారి పాపాలను  తొలగించి సద్గతులనే  ప్రసాదిస్తుంది. ఇది శిక్షారూపంగా కారుణ్యం, శిష్టులైన వారి పట్ల రక్షణ రూపంగా దయ - రెండూ జగన్మాత కృపారూపాలే.

అంతే కాదు- ఆ తల్లి జగజ్జనని మాత్రమే కాదు- జగదీశ్వరి కూడా. జగతిని పాలించేటప్పుడు దుష్టత్వాన్ని నిగ్రహించి, శిష్టత్వాన్ని రక్షిస్తుంది. రెండూ మాతృకృపలే.

కామెంట్‌లు లేవు: