🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మానవుని మరణానంతరం ఆత్మ రెండు విధాలుగా పరయాణిస్తుంది. ఒకటి దేవయానం లేదా ఉత్తరాయణ మార్గం. రెండవది పిత్రుయాణం లేదా దక్షిణాయన మార్గం.
శ్రేయోమార్గంలో జీవితం గడుపుతూ తనువు చాలించే వారు వరుసగా తేజోమార్గాన పగటిని దాటుకుని తర్వాత శుక్ల పక్షాన్ని, ఉత్తరాయణాన్ని, చంద్రుడిని, సంవత్సరాన్ని, సూర్యుడిని దాటుకుని విద్యుత్ లోకి ప్రవేశిస్తారు. అక్కడ మానవుడు కాని పురుషుడు ఉంటాడు. అతను ఆత్మను బ్రహ్మ లోకి తీసుకుని పోతాడు. అక్కడ నుండి ఇక తిరిగి రావడం అనేది ఉండదు. ఇక జన్మ అంటూ ఉండదు. అదే ముక్తి, మోక్షం. ఆత్మ ఈవిధంగా ప్రయాణం చేసేది దేవయానం.
ప్రేయో మార్గంలో జీవితం గడుపుతూ తనువు చాలించేవారు ధూమంలో ప్రవేశించి క్రుష్ణ పక్షంలోకి, దాని నుండి దక్షిణాయనం లోకి ప్రవేశిస్తారు. కానీ సంవత్సరాన్ని చేరుకోలేరు. అక్కడ నుండి వారు పితృ లోకం లో ప్రవేశిస్తారు. దాని నుండి ఆకాశంలోకి, అక్కడ నుండి చంద్రునిలో ప్రవేశిస్తారు.
చంద్రలోకంలో తమ పుణ్య కర్మల ఫలం హరించిపోయే వరకు ప్రేతలు నివసిస్తాయి. పిదప తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మొదట ఆకాశంలోనికి, ఆ తర్వాత వాయుమండలంలోకి చేరి మేఘం గా, వర్షము గా మారి భూమిపైకి దిగుతాయి. ఆ తర్వాత వరి ధాన్యం గానో, యవధాన్యంగానో ఓషధీలతలగానో, వ్రుక్చాలుగానో, తిలలుగానో, చిక్కుడు అంకురాలుగానో జన్మిస్తారు. ఆ ధాన్యాధులను భుజించిన ప్రాణులలో రేతస్సు గా మారి తిరిగి జన్మిస్తారు.
ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి కావాలనుకుంటే ఏమి చేయాలి? కర్మ ఫలం వలననే జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాడు. కావున కర్మ ఫలం ను విడిచి పెట్టాలి. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత లో ఎలా చెప్పాడో చూద్దాం.
ఎవడైతే కర్మ పలాల పట్ల ఆసక్తిని త్యజించి, నిరంతరం త్రుప్తుడుగా, దేన్ని ఆశ్రయించకుండా ఉంటాడో అతడు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మ చేయనివాడే అవుతాడు.
దేహి అయిన వాడికి కర్మలను విడిచిపెట్టడం అనేది సాధ్యం కాని పని. అందుచేత విడిచిపెట్టవలసినది కర్మలను కాదు. వాటి ఫలాలను, కర్మఫలాన్ని విడిచిపెట్టిన వాడే త్యాగి అనబడతాడు.
నీకు కర్మ చేయడానికి అధికారం ఉంది తప్ప కర్మ ఫలం ఆశించడానికి అధికారం లేదు. అలాగని కర్మలు చేయకపోవడం పట్ల కూడా నీకు ఆసక్తి కలుగరాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదేశించారు. సేకరణ
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి