అజ్ఞానంతో దారితప్పిన మానవులను
దారికి తెచ్చి,వారిని తరింపచేసేందుకే నీవు అవతరిస్తావని అంటారు పరమాత్మా
అని కుంతీ దేవి కృష్ణపరమాత్మను కీర్తిస్తోంది.
***
మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు
వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ, చింతన, వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
***
కర్తవ్యం విస్మరించి, కామ్యకర్మలలో మునిగి తేలుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి, వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం, పుట్టుకే లేని పురుషోత్తమ! శ్రీకృష్ణా! నీవు అవతరించావని కొందరి అభిప్రాయం.
🏵️పోతన పద్యాలు🏵️
🏵️తిమిర సంహరణాలు🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి