*గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?*
*శ్రీ గురుభ్యో నమః.*🙏
*1) సూచక గురువు : బాల్యం నుండి మనకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు బ్రతుకుతెరువు కోసం బోధన చేసే గురువులు ఎందరో . మన జీవితంలో మనం ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువులంటారు . వీరి ద్వారా భుక్తిమార్గం తెలుసుకుంటాం.*
*2 ). వాచక గురువు : వీరు ధర్మాధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రమాలు, వాటి ధర్మాల గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థాశ్రమం , వానప్రస్దం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహన వస్తుంది .*
*3 ). బోధక గురువు* : *వీరు మహా మంత్రాలను ఉపదేశిస్తారు . లౌకికంగా కోర్కెలు తీర్చేవాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని ఉపదేశిస్తారు. వీరిని బోధక గురువులంటారు . మనం లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేయగలుగుతాము.*
*4 ) నిషిద్ద గురువులు* : *మారణ ప్రయోగాలు , వశీకరణాలు , వినాశనాలు - ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువులంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళకపోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )*
*5 ) విహిత గురువు* : *మన హితము కోరి సూచనలు సలహాలిస్తారు , నశించిపోయే విషయభోగాలపై ఆసక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేయడం నేర్పుతారు. ( ఏది సత్యం, ఏదసత్యం అనే విచక్షణ తో జివించగలుగుతాము )*
*6) *కారణ గురువు* : *వీరు మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు . ఎన్ని సుఖాలు అనుభవించినా, అంతిమ లక్ష్యం ముక్తి, ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోవడం నేర్చుకుంటాము)*
*7.) పరమ గురువు :* *వీరు సాక్షాత్ భగవత్ స్వరూపం. పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .*
*శిష్యునికి సన్మార్గం బోధించి ‘’ ఈ చరాచరజగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మాస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని మనకు ఆవాహన చేసి మనం అనుభూతి చెందగలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . మన నిజజీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్ భగవంతుడు మనతో జత నడిచినట్లే . వీరు లభిస్తే మన జన్మ ధన్యమైనట్లే.*
సేకరణ....🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి