పాండవులు పూజించిన
దుర్గాదేవి....!!
సాధారణంగా దుర్గాదేవి
ఆలయాలలో ఉత్తర ముఖంగా కాని, పడమటి ముఖంగా కాని దర్శనాను గ్రహాన్ని ప్రసాదిస్తుంది.
విల్లుపురం జిల్లా శంకరిపురం సమీపాన వున్న కల్వరాయన్మలై చరియలలో పన్నెండు వేల దేవ బ్రాహ్మణులు పూజించిన దేవపాణ్డలమ్ గ్రామంలోని ఏటి ఒడ్డున 900 సంవత్సరాల నాటి దుర్గాదేవి ఆలయం .
పై కప్పు ఏమీ లేకుండా మైదానంలో వున్నది. ఈ అమ్మవారిని పంచ పాండవులు తమ వనవాస సమయంలో పూజించి నందు వలన యీ దుర్గాదేవి కి వనదుర్గ అనే పేరు వచ్చింది.
ఇక్కడ దుర్గాదేవి ఏక శిలపై 9 అడుగుల ఎత్తున తూర్పు ముఖంగా అనుగ్రహిస్తున్నది.
ఈ అమ్మవారిని మనసార వేడుకొని, శుక్రవారం నాడు, ఆదివారం నాడు, రాహుకాల సమయాన, పూలమాల సమర్పించి నిమ్మపండు దొప్పలలో దీపం వెలిగించి పూజించిన సంతాన భాగ్యం, వివాహభాగ్యం లభిస్తాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.
తమ కోరికలు నెరవేరిన తక్షణమే అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి, అర్చనాభిషేకాలు చేసి మ్రొక్కులు తీర్చుకుంటారు.
కల్వరాయన్ కొండ ప్రాంతంలో
96 గ్రామాలకు చెందిన కొండ జాతివారు ఈ దుర్గాదేవి ని కులదైవంగా పూజిస్తారు. ఇక్కడ దుర్గాదేవి ని ముస్లింలు కూడా ఆరాధించడం
ఆశ్చర్య పరుస్తుంది. రాహువుకు
అధిదేవత దుర్గాదేవి.
కుటుంబ ఉన్నతికై చందనఅభిషేకం, శతృ బాధా నివృత్తికై కుంకుమ పూతపెట్టి, ఎఱ్ఱ గన్నేరు పుష్పాలతో
పూజించి మ్రొక్కులు తీర్చుకుంటారు.
జీవితంలో సర్వ సుఖాలకి దుర్గాదేవి ని పూజిస్తున్నారు భక్తులు. ఈ ప్రాంతమే పంచ పాండవులు వనవాసం ఆరంభించిన ప్రధమ వనంగా చెప్తారు.
ఆదికాలంలో ఈ ప్రదేశం దట్టమైన అడవిగా వుండేదని
దేవతలు వచ్చి తపమాచరించి వరాలు పొందేవారని, పంచపాండవులు ప్రధమంగా నివసించిన సూర్య వనం యిదే అని చెప్తారు.
పంచ పాండవులు, ద్రౌపది నివసించిన ధౌమ్య వనమని ద్రౌపది కి సూర్యభగవానుడు అక్షయ పాత్ర యిచ్చిన స్ధలమని, దుర్వాస మహామునికి భోజనం పెట్టినదని సుదర్శనగిరి (వృధ్ధగిరి) పురాణంలో చూస్తాము.
పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో వచ్చిన 12000 మంది వేద బ్రాహ్మణులు, ఒక సంవత్సర కాలం ఇక్కడ నివసించారు. అందువలన యీ ఊరు పాణ్డలమ్ అనే పేరుతో ప్రసిధ్ధి చెందినది.
వేయి సంవత్సరాల విశేష మామిడి వృక్షం. కాంచీపురం ఏకాంబరేశ్వరుని ఆలయంలో వున్నట్లుగా పాండవ వనేశ్వరర్.. దుర్గాదేవి
ఆలయానికి మధ్య స్ధలవృక్షంగా యీ మామిడి చెట్టు వున్నది. నాలుగు ఏళ్ళకు ఒక సారి కాస్తుంది.
🌸చెట్టు చుట్టుకొలత 22 అడుగులు. ఎత్తు 77 అడుగులు, వయసు అయినందున పెద్ద గాలికి చెట్టు కొమ్మలు విరిగిపోతూ వుంటాయి.
ఈ చెట్టుకి చాలా చిన్న చిన్న పళ్ళు కాస్తాయి.
వాటి బరువు సుమారుగా 100గ్రా. వరకూ ఉంటుంది, అయితే పెద్ద పండు బరువు 140గ్రా. నుంచి 160 గ్రా.ల వరకు వుంటుంది. ఇది భగవంతుని
అతిశయ సృష్టిగా భావిస్తారు. ఈ చెట్టు కాయలను కొన్ని వందల చిలకలు, ఉడతలు, పలు రకాల పక్షులు తిని ఆనందిస్తాయి.
తిరువణ్ణామలై, శంకరాపురం
మార్గంలో , దేవపాణ్డలమ్ అనబడే గ్రామంలో వున్నది.. స్వస్తి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి