🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈ రోజు దుర్గాష్టమి*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*దుర్గ అన్న నామమే పరమపవిత్రం.*
*దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.*
*దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి, 'గ' కారం జ్ఞానానికి సంకేతాలు.*
*దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.*
*అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగాదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.*
*పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.*
*ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్త బ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుసుకునే పని ఉండదో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.*
*ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.*
*ఓం దుర్గాయై నమః।*
*చదువరులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి