🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 93*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే*
*జగత్త్రాతుం శంభో ర్జయతి కరుణా కాచిదరుణా ‖*
క్రిందటి శ్లోకములో అమ్మవారి యెర్రని వర్ణము, ఆమె సదాశివుని వామాంకము పై కూర్చొనగా, స్ఫటికము వలె తెల్లగా వున్న ఆయన కూడా అరుణ వర్ణమును పొందాడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ అరుణ వర్ణము కరుణకు సంకేతముగా శంకరులు వర్ణిస్తున్నారు.
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము యొక్క రెండవ ధ్యాన శ్లోకములో *అరుణాం కరుణా తరంగితాక్షీమ్* అని చెప్పారు. కరుణ, ఉదయించే సూర్యుని అరుణ వర్ణములో తరంగములుగా అమ్మవారి దయార్ద్రమైన కనుల నుండి ప్రసరిస్తున్నదట. అమ్మా నీవు సాక్షాత్తు కరుణవు అంటున్నారు ఈ సౌందర్యలహరి శ్లోకంలో. కరుణయే అరుణగా సాక్షాత్కరిస్తున్నది. ఎవరి కరుణ?
శంభోః = శంభుని కరుణ. శివుడూ పార్వతి వేరు కాదు ఒకటేనని చాలా సందర్భాలలో చెప్పుకున్నాము. మన కుటుంబములలో కూడా చూడండి. తండ్రికి కూడా బిడ్డలపై ప్రేమ, కరుణ ఉంటాయి. కానీ అవి తల్లి ద్వారానే ప్రకటితమవుతాయి. అలాగే ఇక్కడ అయ్యవారి కరుణ, అమ్మవారి ద్వారా ప్రసరిస్తున్నది.
జగత్త్రాతుం = జగత్తును రక్షించటానికి
కాచిదరుణా = అనిర్వచనీయమైన కరుణ.
అరాళా కేశేషు =అమ్మవారి కేశపాశము వంకీలు తిరిగి అందముగా ఉన్నదట.
ప్రకృతి సరళా = ప్రకృతి సహజమైన
మందహసితే = చిరునవ్వు చిందిస్తున్నారట.
సరళా అంటే వంకర లేని అని కూడా అర్ధం కదా! అంటే కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వు. చిరునవ్వు కారుణ్య స్వభావానికి ప్రతీక.
శిరీషాభా చిత్తే = ఆమె మనసు శిరీష పుష్పము (దిరిసెన పూవు) వలె కోమలముగా సున్నితముగా ఉన్నదట.
దృషదుపలశోభా కుచతటే = వక్ష స్థలము రాయి వలె కఠినముగా ఉన్నదట.
భృశం తన్వీ మధ్యే = ఆమె నడుము సన్నగా వున్నది.
పృథురురసిజారోహ విషయే = జగత్తును పోషిస్తున్న ఆమె వక్షము విశాలముగా వున్నది.
ఈ విధముగా ఈ శ్లోకములో ద్వంద్వములు చెప్తున్నారు శంకరులు. ఇవన్నీ జగత్తుకు మేలు చేసేవే.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి