(((((ఆలోచనాలోచనాలు ))))) అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక. 1* అజ్ఞానం ఇచ్చిన ధైర్యాన్ని విజ్ఞానం ఇవ్వదు. 2* అభిమానం లోనికి ప్రవేశిస్తే, అభివృద్ధి వెలుపలికి నడుస్తుంది. 3* సత్యం చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం భూప్రదక్షిణం చేసివస్తుంది. 4* మనిషిని చులకన చేసేది "తన గొప్ప తాను చెప్పుకోవడమే!" 5* ఉన్నతులు"ఆశయాల" కొరకు జీవిస్తారు. అల్పులా? వారు"ఆశల" కొరకు జీవిస్తూవుంటారు. 6* ఉపకారం చేయలేని దుర్బలుడు కూడా చేయగల గొప్ప ఉపకారం , ఇతరులకు "అపకారం" తలపెట్టకపోవడమే! 7* సంపదలు మనిషిలోని అవగుణాలను బహిర్గతం చేస్తాయి. కష్టాలా? అవి వ్యక్తి లోని సుగుణాలను వెలువరిస్తాయి. 8* కోర్కెలను మనం తినుట లేదు. నిజానికి కోర్కెలే మనలను తినివేస్తున్నాయి. 9* గుంపుకు అనేక శిరస్సులు ఉంటాయి. కానీ వాటిలో "మెదళ్ళు"మాత్రం ఉండవు. 10* గణం కాదు ప్రధానం; గుణం. రాశి కాదు ప్రధానం, వాసి. 11* అది ఏడంతుల భవనమే కావచ్చు; పసిబిడ్డలు నడయాడకపోతే అది గృహమని పిలువబడదు. అదొక దయ్యాలకొంప. 12* మనలో చాలామంది తట్టుకోలేనంత శక్తిగల ఆయుధం,"" నిశ్శబ్దం."" ""ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః"" ఋగ్వేదం 1వ మండలం, 89వ సూక్తం. " మనకు అన్ని వైపులనుండి ఉదాత్త భావనలు లభించుగాక!" (Let noble thoughts come from every side.). తేది 1--12--2023, శుక్రవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి