10, జులై 2022, ఆదివారం

గురుపౌర్ణమి

 వందేమాతరం


*గురుపౌర్ణమి - నిజాలు - జాగ్రత్తలు*


_గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః'_


సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది.


_గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే_


అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం బోధిస్తోంది.


నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భాగవతం...., మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణిమ. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. 


ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో యతులు, పీఠాధిపతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకేచోట ఉండి జ్ఞానబోధన చేస్తుంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ రోజు తమకు సమీపంగా నివసిస్తున్న తప:స్సంపన్నులను దర్శించుకొని, పూజించి, జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది.  


దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.


"గురు పరంపరాసిద్ధ్యర్థం వ్యాసపూజాం కరిష్యే".


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరాః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువేనమః

లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్


అని భగవంతునితో ప్రారంభమైన గురుపరంపర వ్యాసభగవానునితో కొనసాగి, మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది. కనుక వ్యాసభగవానుని ఈ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి. వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువులు మనకు ఉపదేశిస్తారు.


మనకు గురువులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వారిని దర్శించుకోండి.


ఈ చరాచర సృష్టికి మూలమైన ఆదిగురువు ఆదియోగి పరమేశ్వరుని దర్శించుకోండి.


ఈ జగత్తుకు గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ ను దర్శించుకోండి.


సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోండి.


శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళి ధ్యానం చేయండి.


ఆది శంకరాచార్య వద్దకు వెళ్ళండి.


కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?

కొంచమైన ఆలోచిస్తున్నారా?


గురువారం అనగానే ఈ బాబావారంగా మార్చి పడేసారు.


ఇది ఎంతవరకు అర్థవంతం? 

ఆలోచించాలి. నిత్యం తన మత విధానాలలో ప్రార్థన చేస్తూ ఏనాడు మన హిందూ ధర్మ విషయాలను ఆచరించని, కనీస ఎవరికి ధర్మ బోధన చేయని వ్యక్తి మనకు గురువు ఎలా అవుతాడు.


ఒక్క సారి మనమేంటి?

మన వారసత్వం ఏంటి? 

మన పూర్వీకులు ఎవరు?

మన ఆదర్శనీయులు ఎవరు? 

ఆలోచించాలి.


ఈ ఫకీర్ ఎవ్వరికి గురువు కాదు, ఆఖరికి ఇస్లామీయులకు కూడా కాదు. పైగా ఈయన పుట్టింది గురుపౌర్ణమి రోజు కూడా కాదు.

 

కనీసం ఒక్క సారి ఆలోచించండి.

ఇంకా గురువుల దర్శనం చేసుకోవాలంటే...

ఈరోజు సమాజం లో చాలా మంది హిందూ స్వామీజీలు ఉన్నారు.

వారి వద్ద కు వెళ్ళండి..వారిని పూజించండి, వారి ఆశీస్సులు తీసుకోండి.

వారితో పాటు మనకు చదువు చెప్పిన గురువులను దర్శించుకోండి.

మన తల్లి తండ్రులకును మించిన గురువు లెవరు?‌ వారి ఆశీస్సులు తీసుకోండి.


అంతేగాని, గురు స్థానంలో ఉండవలసిన హైందవ ధర్మ అభ్యున్నతికే కృషి చేసిన ఎందరో మహానుభావులను, కారణజన్ములను విస్మరించి, మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని విచ్చిన్నం చేయడానికి వచ్చిన హిందూయేతర మతస్తులను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి.


ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి.


రేపటి తరానికి విలువలతో కూడిన మన సనాతనధర్మ విశిష్టతను స్వచ్ఛంగా అందజేయండి.


తస్మాత్ జాగ్రత్త


మీ

మృశి

కామెంట్‌లు లేవు: