26, జూన్ 2021, శనివారం

పెద్దల తిథులు

 🌹 *పెద్దల తిథులు ఏ కారణము చేతనో జరపలేక పోతే ఏమి చెయ్యాలి?* 🌹

(సేకరణ: పి.యల్.నరసింహాచార్య

దాసన్)

(25.6.21)


మంచి పనులకే ఆటంకాలు ఎక్కువ! అయినా జన్మ‌నిచ్చిన తల్లిదండ్రుల‌ పట్ల కర్తవ్యలోపము రాకూడదు.‌ స‌కల్పముండాలే కాని ఏ కారణమూ అడ్డము కాదు. వీలైతే ముగ్గురు సద్బ్రాహ్మణులు  భోక్తలుగా దొరకనప్పుడు ~ ఇప్పటి కరోనా ఇబ్బ‌దులవల్ల  ~ హిరణ్య శ్రాద్దా‌న్ని‌ చేయవచ్చును. దేవాలయములోని‌ అర్చకునికి చెప్పితే,  వారు మీతో మంత్రపూర్వకముగా తర్పణము చేయిస్తారు; మీకు తోచిన దక్షిణను తాంబూల సహితంగా ఇవ్వ వచ్చును. 


      ఇదే కాక *ఆమశ్రాద్దము* చేయవచ్చు‌ను. ఒక బ్రాహ్మణునికి కావలసిన *అపక్వ* పదార్థాలను ఇచ్చి అతను చెప్పిన విధముగా మీరు తర్పణాన్ని చేసి అతనికి దక్షిణతాంబూలాదులు ఇవ్వ వచ్చును.  బియ్యము, పప్పుది‌నుసులు,  పాలు, పెరుగు, కొ‌‌న్ని కాయగూరలను ఇచ్చి  వారీంటిలో తళిహ (వంట) చేయించుకుని  భోజనము చేయమని‌ చెప్పవచ్చును. దీన్ని ఆమ శ్రాద్దమని అంటారు. ఈ నాడున్న కరోనా వల్ల కొందరు బ్రాహ్మణులు వంటకు అవసరమైన పదార్థాలను తీసుకొనడానికి ఇష్టపడక పోవచ్చును. అలాంటప్పుడు ఇలా *హిరణ్య శ్రాద్దా‌న్ని*  జరిపించవచ్చును. ఇదే కాక మీ కులదైవానికి దేవాలయములో ఏదో ఒక ప్రసాదాన్ని చేయించి దాన్ని నైవేద్యముగా సమర్పించి పెద్దల గొత్రనామాలతో అర్చన‌‌ చేయించి ప్రసాదాన్ని, దక్షిణ తాంబూలను అర్చకునికి ఇచ్చి నమస్కరించాలి. ఈ పద్దతులను నిష్ట కల స్వాములు అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాటించాలి సుమా!


*(శ్రీమతే రామానుజాయనమః)*

కామెంట్‌లు లేవు: