ఏవి సుఖాలు ?
🪷🪷🪷🪷🪷
మహాభారతంలో సందర్భానుసారంగా ఎన్నో నీతులను చెప్పారు వ్యాసులవారు.
'మనిషికి ఏవి సుఖాలు? అని పరిశీలిస్తే ఆరు సుఖాలు అని చెప్పవలసి వస్తుంది. అవి ఏమిటంటే-
*అర్థాగమో నిత్యమరోగితా చ*
*ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ*
*వశ్యశ్చ పుత్రో౽ర్థకరీ చ విద్యా*
*షడ్జీవలోకస్య సుఖాని రాజన్!*
నిత్యం ధనార్జన చేయడం ఒకటి. ఏ రోగాలు లేకుండా ఉండడం రెండవది. ప్రియమైన భార్య ఉండడం మూడవది. భర్తతో ప్రియంగా మాట్లాడే భార్య ఉండడం నాల్గవది. పుత్రులు తండ్రి మాటను పాటించేవారై ఉండడం ఐదవది. తాను నేర్చుకొన్న విద్య భుక్తి ఉపయోగపడేది కావడం ఆరవది.
ఇలా మనిషికి ఆరు విధాలైన సుఖాలు పూర్వపుణ్యంతోనే వస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి