13, డిసెంబర్ 2020, ఆదివారం

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36  / Sri Devi Mahatyam - Durga Saptasati - 36 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 3 🌻*


26. దైత్యజనులకు రేడైన ఆ శుంభుడు తనమీదికి కవియుట చూసి, దేవి అతని వక్షస్థలంపై దూరేలా శూలాన్ని ప్రయోగించి, అతనిని నేలపై కూలి పడిపోయేటట్లు చేసింది.


27. దేవి యొక్క శూలపు మొన వల్ల గాఢంగా గాయపడి అతడు ప్రాణాలు కోల్పోయి నేలగూలగా భూమి అంతా, పర్వత సముద్ర ద్వీప సహితంగా సంచలించింది.


28. ఆ దురాత్ముడు హతుడయినప్పుడు అఖిల ప్రపంచం సుఖం పొంది పూర్ణమైన స్వస్థత పొందింది. ఆకాశం నిర్మలం అయ్యింది.


29. అతడచట కూల్చబడినప్పుడు ఘోరమైన అశుభాలను సూచించేవీ, కొరివి పిడుగులుగలవి అయిన తొల్లిటి మేఘాలు శాంతించాయి. నదులు తమ సరియైన మార్గాలనే పట్టి ప్రవహించాయి.


30. అతడు హతుడైనప్పుడు సర్వదేవగణాల మనస్సులు పట్టరాని ఆనందాన్ని పొందాయి. గంధర్వులు మనోహరగానం చేసారు.


31–32. ఇతరులు వాద్యాలు మ్రోగించారు. అప్సర గణాలు (అచ్చరపిండులు) నృత్యం చేసారు. అనుకూల మారుతాలు వీచాయి. సూర్యుడు పూర్ణతేజస్సుతో వెలిగాడు. అగ్నులు శాంతంగా దీవించాయి. దిక్కులందు పుట్టిన నాదాలు శమించాయి.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లోని "శుంభవధ” అనే దశమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹🌹

కామెంట్‌లు లేవు: