8, జూన్ 2023, గురువారం

పాత ఉత్తరాలు

 *పాత మధుర సంప్రదాయం*

💖💖💖💖💖💖💖💖


*పూర్వం పోస్టు కార్డు లో పెద్దలకు "మహారాజశ్రీ" అనే పదం వాడేవారు. పిన్నలకు  "ప్రియమైన" లేక "చిరంజీవి" పదాలు వాడేవారు. స్త్రీలకు పెద్దవాళ్ళైతే  "లక్ష్మి సమానురాలగు" పదాలు వాడేవారు. విధవలకు  "గంగాభాగీరథీ సమానురాలగు" అనే పదాలు వాడేవారు. ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు. ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబసమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, స్నేహం, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.*


*వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల ‘పసుపు’ రాసి పంపిస్తుండేవారు. చావులాంటి అశుభ వార్తలుంటే ‘సిరా’ ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. మామూలు ఉత్తరాలను ఒక ‘తీగెకు గుచ్చి’ పదిలంగా ఉంచుతుండేవారు.*


*తీగకు గుచ్చిన పాత ఉత్తరాలు మళ్లీ మళ్లీ చదివి పాత స్మ్రుతులు నెమరు వేసుకుని ఆనందించేవారు.*


*ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం. వాడి పడేసే సాంప్రదాయం. ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాల కోసం కాగడా పెట్టి వెతికాల్సిన పరిస్థితి.*

కామెంట్‌లు లేవు: