17, మే 2023, బుధవారం

దండం దశగుణం భవేత్*

 *దండం దశగుణం భవేత్*


ఈ వాక్యానికి  అర్థాన్ని మార్చేశారు. దండిస్తే కానీ పని జరగదు అనే సందర్భంలో "దండం దశగుణ భవేత్" అంటారు నేటి సమాజంలో. కానీ ఆ వాక్యం అసలు అర్థం అదికాదు...


అసలు అర్థాన్ని ఈ క్రింది శ్లోకం తెలియ జేస్తుంది


శ్లోll విశ్వామిత్రాహి  పశుషు

కర్దమేషు జలేషు చ

అంధే తమసి వార్ధక్యే

దండం దశగుణం భవేత్


దీనిలోని అర్థం -


1. వి - పక్షులు,

2. శ్వా - కుక్కలు,

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు),

4. అహి - పాములు,

5. పశు - పశువులు,

6. కర్దమేషు - బురదలో,

7. జలేషు - నీటిలో,

8. అంధే - గుడ్డితనంలో,

9.తమసి - చీకటిలో,

10. వార్ధక్యే - ముసలితవనంలో


దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, భవేత్ - కలిగిస్తుంది.


అంటే

కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి,

బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆసరాగా ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగ పడుతుంది అని భావం


✨✨✨✨✨✨✨✨✨

కామెంట్‌లు లేవు: