శ్లోకం:☝️
*స్వయం కర్మ కరోత్యాత్మా*
*స్వయం తత్ఫలమశ్నుతే ।*
*స్వయం భ్రమతి సంసారే*
*స్వయం తస్మాద్విముచ్యతే ॥*
- చాణక్యనీతి
భావం: జీవాత్మ స్వయంగా కర్మ చేస్తుంది. జీవాత్మే శుభాశుభ ఫలాలను అనుభవిస్తుంది. జీవాత్మే స్వయంగా లోకంలో అనేక ఉపాధులలో భ్రమిస్తూ (శరీరాలలో జన్మిస్తూ మరణిస్తూ) చివరికి తన స్వయంకృషితో జననమరణ చక్రాన్ని తప్పించుకుని మోక్షాన్ని పొందుతుంది.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి