భూమియందు జలధారలు కనుగొను విధానం -
* బావిలో నీరు ఉప్పగా ఉండినను , బురదగా లేదా వగరుగా , దుర్గన్ధముగా ఉండినచో మద్దిచెట్టు బెరడు , తుంగ గడ్డలు , వట్టివేళ్లు , శొంఠి , బీర విత్తులు , ఉశిరిక పొట్టు , చిల్లగింజలు తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని బావినీటిలో కలిపిన ఆ బావినీరు తియ్యగా , శుభ్రముగా తయారగును. బావి వొడ్డున ఉశిరిక చెట్టు వేసినను బావినీరు తియ్యగా ఉండును.
* మనిషి శరీరమున సిరలు ఏవిధముగా రక్తమును తీసుకువెళ్లే విధముగా ఉండునో అదేవిధముగా జలనాడులు భుమియందు ఉండును. ఈ జలనాడులు పెద్దవి మరియు చిన్నవిగా ఉండును.
* పాతాళం నుండి పైకి వచ్చు జలనాడులను మహ సిరలు అనగా పెద్దగా జలతో కూడిన నాడులు అని అర్థం. దక్షిణదిశ , పశ్చిమ దిశ , ఉత్తరదిశ నుండి వచ్చు నాడులు శుభప్రధములు . ఆగ్నేయ , నైఋతి , వాయువ్య దిశల నుండి జలనాడులలో జల స్వల్పంగా ఉండును.
* నిర్జల ప్రదేశము నందు నీరు ప్రబ్బలి చెట్టు ఉన్న దానికి పడమర దిశలో మూడు మూరల దూరము నందు ఒకటిన్నర పురుష ప్రమాణం నందు పశ్చిమదిశ నుండి వచ్చు జలనాడి ఉండును. ముందుగా తెల్లటి కప్పు వచ్చును. ఆ తరువాత బండ వచ్చును. ఆ బండని చేధించిన పిమ్మట జలం ఉండును.
* పురుష ప్రమాణం అనగా 120 అంగుళములుగా లెక్కలోకి తీసికొనవలెను. మరికొన్ని గ్రంథాలలో పురుషుడు నీటిలోకి దుమికెప్పుడు తన చేతులను పైకి ఎత్తునప్పుడు 120 అంగుళములు ఉన్నచో దానిని పురుషప్రమాణముగా నిర్ధారించుకొనవలెను .
* నిర్జల ప్రదేశము నందు నేరేడు చెట్టు ఉన్నచో ఆ నేరేడు చెట్టుకు ఉత్తర దిశకు మూడు మూరలు దూరములో రెండు పురుష ప్రమాణంలో తవ్విన తూర్పు దిక్కు నుండి వెలువడు ఐంద్రి అను పేరుగల జలనాడి ఉండును. అందులో ఇనుపవాసన కలిగిన మృత్తిక ( మట్టి ) , తెల్లని కప్ప ఉండును.
* తోయరహిత ప్రదేశము నందలి నేరేడు చెట్టునకు తూర్పు దిశ యందు పుట్టయున్నచో దానికి సమీప దక్షిణ పార్శ్వమున రెండు పురుష ప్రమాణములు తవ్విన అందు మధుర జలం ఉండును. తవ్వు సమయమున అర్థ పురుష ప్రమాణం నందు ఒక చేప , పావురపు రంగు గల బండ , నల్లని మట్టి దాని క్రింద జలం ఉండును .
* జలహీన ప్రదేశము నందు అత్తిచెట్టు ఉన్నచో దానికి పడమట మూడు మూరల దూరంలో రెండున్నర పురుష ప్రమాణములు తవ్విన అందు ఒక పురుష ప్రమాణంబున తెల్లని సర్పము , నల్లని రాయి ఆ క్రింద తూర్పు దిశ నుండి మధురజలం స్రవించెడి జలనాడి ఉండును.
* నిర్జల ప్రదేశము నందలి నల్లవావిలి చెట్టుకు పుట్ట చుట్టుకుని ఉన్న దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరమున రెండుంబాతిక పురుష ప్రమాణము తవ్విన ఎన్నటికి ఎండిపోని జలనాడి ఉండును. అందు అర్థ పురుష ప్రమాణమున ఎర్రని చేప , దాని క్రింద కపిల వర్ణము గల మృత్తిక దాని క్రింద తెల్లని మృత్తిక దాని క్రింద ఇసుకయు ఆ క్రింద సున్నపు రాళ్ళను దాని క్రింద ఉదకము ( నీరు ) ఉండును .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి