కాళ్ళూచేతులూ తిరుగుతున్నంత కాలం, మైమరచి,
పదవులు కలిగిన వారి వెంట పడి పడి తిరిగి వారి సేవలో
తరించడం ఒక్కటే ఈ జన్మకు సార్థకమని భావించే వారికి
కనువిప్పు కలిగించే పద్యం ఇది.
.
***
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్
*** ***
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో వ్రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయిన రాజులెవరికి ఇవ్వటానికి నా మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాల లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని నాకు తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను, చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా పరమ పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని సర్వాంతర్యామి అయిన ఆ శ్రీహరికే సమర్పించుకుంటున్నాను.
స్వగతంగా అనిపించినా, అంతర్లీనంగా ఈజాతికిది సందేశం.
500 సంవత్సరాలకు పూర్వమే జాతికి దిశా నిర్దేశం చేసిన మహిమాన్వితుడు పోతన
🏵️*పోతన పద్యాలు- జాతిని మేల్కొలిపే ఆణిముత్యాలు*🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి