*కం*
ఇష్టం బగునదె మనసగు
కష్టము నది స్వంతమయ్యు గమనించంగా
స్పష్టంబగు నీ సూక్ష్మము
సుష్టుగ గుర్తించకున్న శుంఠగు సుజనా.
*భావం*:-- ఓ సుజనా!ఇష్టమైన దే మనస్సు కు నచ్చుతుంది,అది కష్టం తోనే దక్కుతుంది, గమనించగా స్పష్టంగా అర్థమయ్యే ఈ చిన్న విషయాన్ని బాగా గుర్తించకపోతే మూఢుడవగుదువు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
ఎవ్వారల కష్టంబుల
నవ్వారలు భారమంచు నాక్రోశించున్.
దవ్వున నును కొండలవలె
చివ్వున నొరులొందు సుఖము చిత్రణె సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఎవరి కష్టాలు వారి కి భారంగా అనిపించి ఆందోళన చెందుతారు. దూరంలో ఉన్న కొండల నునుపు వలె ఇతరులు నీకంటే సుఖంగా ఉన్నట్లు కనబడతారంతే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి