*శుభోదయం*
🙏💐🙏💐🙏
*కర్మలే జన్మకు కారణం. ఎలా?*
*జీవుడు దేవుడు ఎప్పుడు అవుతాడు?*
విత్తనము బీజంగా మారాలంటే దానిపై ఒక పొర ఉంటుంది... సారవంతమైన నేలలో ఆ బీజాన్ని నాటి, దానికి నీరు అందించినప్పుడు అది మొక్కగా మారి భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఇది సృష్టి..
అలాగే జీవుడు అహం (నేను) భావన (బీజం) తో ఉన్నప్పుడు అది మనసు ఇంద్రియాలతో కలిసి కర్మ (మొక్క) గా మారుతుంది..
మొక్క వృక్షంగా మారి విత్తనాలుగా, ఆ విత్తనాలు మరెన్నో మొక్కలుగా ఎలాగైతే మారుతున్నాయో, అలాగే *అహం కర్మగా, కర్మ జన్మగా మారుతుంది..*
*విత్తనానికి బీజ పొర తొలగితే మొక్క లేదు.*
*జీవుడికి అహంభావన పొర తొలగితే కర్మ లేదు.*
*కర్మ లేకపోతే జన్మ లేదు.. జన్మలేని జీవుడు దేవుడే అవుతాడు..*
అంటే
*"నేను - అహం" (నేను అనే భావన) వదలితే జీవుడు దేవుడౌతాడు..*
*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి