13, నవంబర్ 2020, శుక్రవారం

దీపం పెట్టేటప్పుడు

 ప్రతి రోజూ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం….


🙏 దీపం - తేజస్సు యొక్క తత్వానికి ప్రతీక. రోజూ

రెండు సార్లు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయంలో (సంధ్యాకాలంలో) తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ స్వరూపం. మనలో కూడా నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.


🙏 అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.


🙏 ఇక దీపం వెలిగించిన ప్రమిద బంగారంది కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపూ, కుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పండుగ రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)


🙏 దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండూ లేదా మూడు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతా స్వరూపమైన 

ఆ దీపానికి నమస్కరించాలి.


🙏 ఏ ఇంట్లో నిత్యం రెండు పూటలా దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.


🙏 ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.


🙏 తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మా! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాక!.


జై శ్రీ కృష్ణ...


దయచేసి నేను పంపించిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.


      👉 మీ నారాయణం వెంకటరెడ్డి 👈

                  90590 34010

కామెంట్‌లు లేవు: