🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 65*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*వివాహ ప్రయత్నాలు*
ఒక వంక మిత్రుల ప్రయత్నాలు ఇలా ఉండగా ఇంట్లో భిన్నమైన పరిస్థితిని నరేంద్రుడు ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ప్రారంభమైన వివాహ ప్రయత్నాలు మళ్లీ కొనసాగాయి; ఆతణ్ణి మరీ ఇబ్బందికి గురిచేశాయి. తండ్రి ఉన్నప్పుడు అతడు వివాహాన్ని తిరస్కరించడం పెద్ద సమస్యగా తోచలేదు. కాని ఇప్పుడది విశ్వరూపం దాల్చింది. కోరినంత కట్నంతో వధువును ఇవ్వడానికి సిద్ధమయినప్పుడు, ఈ దారిద్ర్య పరిస్థితిలో ఆతడు తిరస్కరించడం ఇంట్లోవారు జీర్ణించుకోలేకపోయారు.
పేదరికపు గుప్పిట నుండి విడివడడానికి కనిపిస్తున్న ఒకే దారిని అతడు మూసి వేస్తున్నాడని వారు భావించారు. చివరకు తల్లియైన భువనేశ్వరి ఒక అడుగు ముందుకువేసి ఒక పిల్లను చూసి నిశ్చయం కూడా చేసింది. ఆ తరువాత నరేం ద్రుడు గట్టిగా తిరస్కరించలేకపోయాడు. జరుగబోయేది జరుగనీ అనుకొని, తనను నమ్ముకొని ఉన్నవారి కోసం వివాహం చేసుకోవడానికే నిశ్చయించుకొన్నాడు.
నరేంద్రుని వివాహం గురించి శ్రీరామకృష్ణులకు తెలిసింది. వెంటనే ఒక బండి బాడుగకు తీసుకొని తిన్నగా నరేంద్రుని ఇంటికి వెళ్లారు. నరేంద్రుడు బయటికి వచ్చి ఆయనను కలుసుకొన్నాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఆతడి చేతులు పుచ్చుకొని, నేను విన్నది నిజమేనా అని అడిగారు. నరేంద్రుడు తలదించుకొని, "అవును. నేను వివాహానికి సమ్మతించాను" అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేతులను నొక్కి పట్టుకొని, "ఈ వివాహం జరగదు.ఇవి నా మాటలు సుమా!” అంటూ బండి ఎక్కి వెళ్లిపోయారు. అవాక్కై నిలబడి పోయాడు. నరేంద్రుడు!🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి