భక్తకవి పోతన
సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'
పరికించి చూచిన భక్తవరుడు
'ఎవనిచే జనియించు నీ జగమ్మ 'నుచును
'కరిచేత' తెల్పిన పరమబుధుడు
'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !
యవనిలో నుండిరే!' యనిన ఘనుడు
కన్నీరు నింపిన కమలాసనునిసతి
న్నోదార్చి పొగడిన యోగివరుడు
తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము
రచన జేసియు నత్యంత రమ్యముగను
తెలుగు వారికి నిచ్చిన దివ్య సుకవి
పోతనకు మించి యెవ్వరు పుడమి గలరు ?
అట్టి కవివర్యునకు భక్తి నంజలింతు
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి